తాజ్ సోయగాలకు ముగ్ధులైన ట్రంప్ దంపతులు

భారత్ రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు ఈ రోజు ఆగ్రాలో అడుగుపెట్టారు. భార్య మెలానియాతో కలిసి ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ను ట్రంప్ సందర్శించారు. తాజ్ మహల్ అందాలకు ట్రంప్ దంపతులు మంత్రముగ్ధులయ్యారు. చేతిలో చేయి వేసుకొని తాజ్ మహల్ చుట్టూ కలియ తిరుగుతూ తాజ్ అందాలను ఆస్వాదించారు. చాలా ఆసక్తిగా తాజ్ విశేషాలను స్థానిక గైడ్ ను అడిగి తెలుసుకున్నారు ట్రంప్ దంపతులు. తాజ్ […]

  • Written By: Neelambaram
  • Published On:
తాజ్ సోయగాలకు ముగ్ధులైన ట్రంప్ దంపతులు


భారత్ రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు ఈ రోజు ఆగ్రాలో అడుగుపెట్టారు. భార్య మెలానియాతో కలిసి ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ను ట్రంప్ సందర్శించారు. తాజ్ మహల్ అందాలకు ట్రంప్ దంపతులు మంత్రముగ్ధులయ్యారు. చేతిలో చేయి వేసుకొని తాజ్ మహల్ చుట్టూ కలియ తిరుగుతూ తాజ్ అందాలను ఆస్వాదించారు.

చాలా ఆసక్తిగా తాజ్ విశేషాలను స్థానిక గైడ్ ను అడిగి తెలుసుకున్నారు ట్రంప్ దంపతులు. తాజ్ వెనుక భాగంలో ఉన్న యమునా నదిని కూడా ట్రంప్ దంపతులు వీక్షించారు. తాజ్ అందాలు చూసి ముగ్ధులయ్యారు ట్రంప్ దంపతులు. పర్యటనకు గుర్తుగా సందర్శకుల బుక్ లో ఓ సందేశం రాసి సంతకం పెట్టారు ట్రంప్ దంపతులు. ట్రంప్ కూతురు ఇవాంకా,అల్లుడు కుష్నార్ కూడా తాజ్ అందాలకు ముగ్ధులయ్యారు.