Huzurabad and Badvel: తెలంగాణలోని హుజురాబాద్, ఏపీలోని బద్వేల్ లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయింది. రెండు చోట్ల అధికార పార్టీ అభ్యర్థులే ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ లో అధికార పార్టీ తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు. పోటీ మాత్రం రెండు పార్టీల మద్యే కొనసాగింది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ప్రధానమైన పోరు నడిచింది.
హుజురాబాద్ లో 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా ఇందులో టీఆర్ఎస్ కు ఆధిక్యం లభించింది. టీఆర్ఎస్ కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ కు 32 ఓట్లు పోలయ్యాయి. 14 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. తొలుత హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట్ నుంచి కౌంటింగ్ మొదలవుతుండగా చివరికి కమలాపూర్ మండలం శంభునిపల్లి తో ముగుస్తుంది. మొత్తం 14 టేబుళ్లపై 22 రౌండ్లలో లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు.
బద్వేల్ లో కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. బద్వేల్ లో అధికార పార్టీ వైసీపీ అభ్యర్థి దాసరి సుధ 24 వేల ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ అభ్యర్థి దూసుకుపోతుండటంతో ఆమెదే గెలుపు అనే అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి. నియోజకవర్గంలో 2,15,240 ఓట్లుండగా 1,47,213 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకపోవడంతో వైసీపీకే మెజార్టీ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
పోస్టల్ బ్యాలెట్లలో కూడా వైసీపీ ఆధిక్యం కొనసాగించింది. మొత్తం 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దీంతో ఫలితాలపై అందరి అంచనాలు నిజమవుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి ఆధిపత్యం కొనసాగుతోంది.
Also Read: CM KCR: ప్రకటించి రెండేళ్లాయే.. ఉద్యోగాలేవి కేసీఆర్ సారూ?
హుజురాబాద్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో మాత్రం ఉత్కంఠ నెలకొంది. తుది ఫలితాలు వెల్లడయ్యే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సమీప టీఆర్ఎస్ అభ్యర్థిపై 166 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రజల్లో ఒకటే ఆలోచన వస్తోంది. హుజురాబాద్ లో గెలుపెవరిదో అనే దానిపై ప్రతి రౌండ్ లో సర్వత్రా ఉత్కంఠ ఏర్పడేందుకు అవకాశం కలుగుతోంది. దీంతో అందరు ఫలితాల వెల్లడిపై ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Huzurabad By Poll: హుజూరాబాద్ విజేత ఎవరు? ఉత్కంఠ.. తేలేది నేడే.. కౌంటింగ్ ప్రారంభం