Soothe Canker Sores : మీ శరీరంలో అధిక వేడి వస్తే ఈ లక్షణాలు వస్తాయి.. ఈ చిట్కాతో నయం చేసుకోండి
నోట్లో మంట తగ్గించానికి తేనె బాగా ఉపకరిస్తుంది. ఇందులో ఉండే యాంటి మైక్రోబయల్ ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అయితే తేనెను నోట్లో మంట ఉన్నచోట రాసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది

Soothe Canker Sores : మానవశరీరంలో సాధారణంగా 37-38 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మనుషులు గాలి ఉష్ణోగ్రత 18 సెంటిగ్రేడ్ ఉండే వాతావరణంలో ఉండడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కానీ వాతావరణంలో వచ్చిన మార్పులతో ఒక్కోసారి బయటి ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో మానవ శరీరం తట్టుకోలేక శరీరంలోని ఉష్ణోగ్రత బయటకి వస్తుంది. ఇది కొందరి శరీరాల్లో అనారోగ్యాన్ని తీసుకురావొచ్చు. ఇలా రావడం వల్ల అవయవాలు అసౌకర్యానికి గురై.. ఫీవర్ వస్తుంది.
జ్వరం తో నోటి పూత లాంటివి ఏర్పడి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఈ నోటి పూత పెద్ద వ్యాధి కాకపోయినా ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న ఇబ్బందిని కలిగిస్తుంది. దీంతో అలసట ఏర్పడి శరీరంలో శక్తిని తగ్గిస్తుంది. నోటి పూతను తగ్గించుకోవడానికి ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో నయం చేసుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంట్లో లభించే ఈ పదార్థాలతో చిన్న ప్రయోగం చేయాలి. అప్పటికీ తగ్గకపోతే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. మరి ఆ చిట్కాలేవో తెలుసుకుందాం..
వేడిని తగ్గించే పదార్థాల్లో పసుపు ఒకటి. పసుపును కూరల్లో కచ్చితంగా వాడుతూ ఉంటాం. దీనిని నేరుగా నోట్లో వేసుకుంటే చేదుగా ఉంటుంది. కానీ శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించే గుణాలు ఇందులో ఉంటాయి. అందువల్ల నోటిపూత ఏర్పడిన వాళ్లు పసులో కొద్దిగా వాటర్ పోసి పేస్టులాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును నోటి పూత ఉన్న ప్రదేశంలో రాయాలి. ఇలా కొద్దిసేపు అలాగే ఉంచుకోవాలి. ఆ తరువాత నోట్లో నీరు పోసుకొని పుక్కిలించి ఉమ్మేయాలి. ఇలా ఒకటి, రెండు రోజుల్లో చేస్తే నోటిపూత మటుమాయం అయ్యే అవకాశం ఉంది.
వేసవిలో వేడి చేసిన వారికి ఎక్కువగా కొబ్బరి బోండాలను తాగిస్తూ ఉంటారు. తక్షణ శక్తి కోసం ఇవి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే కొబ్బరి నీళ్లు తాగినా నోటి పూత తగ్గే అవకాశం ఉంది. కానీ కొబ్బరి పాలను తయారు చేసుకొని నోట్లో పుక్కిలించి ఉమ్మేయడం ద్వారా నోట్లో మంట తగ్గుతుంది. ఇలా సాధ్యమైనంత వరకు చేస్తూ ఉండాలి.
యాపిల్ సైడర్ వెనిగర్ కూడా నోటిపూతను తగ్గిస్తుంది. ఇందులో యాంటి బ్యాక్టీరియల్ ఉంటాయి. ఇవి నోట్లో ఉండే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా పుక్కలించి ఉంచాలి. ప్రతీరోజూ ఉదయం, రాత్రి ఇలా చేయడం వల్ల నోట్లో ఉండే పొక్కులు త్వరగా తగ్గుతాయి.
నోట్లో మంట తగ్గించానికి తేనె బాగా ఉపకరిస్తుంది. ఇందులో ఉండే యాంటి మైక్రోబయల్ ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అయితే తేనెను నోట్లో మంట ఉన్నచోట రాసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇలా 2 గంటలకోసారి రాసుకుంటే ఒక్కరోజులోనే నోటిపూత మాయమవుతుంది.
