Troll Of The Day: టీవీల్లో సీరియల్ లో ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తున్న రోజులు ఇవి. చానల్స్ కూడా వాటి మీద కోట్లకు కోట్లు పెట్టుబడులు పెడుతున్న రోజులు కూడా ఇవే.. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎక్కువ రీచ్ ఉండటం.. పైగా రెవెన్యూ కూడా భారీగా కళ్ళ చూసే అవకాశం ఉండడంతో సీరియల్స్ నిర్మాణం భారీగా ఉంటున్నది. ఒకప్పుడు సీరియల్స్ అంటే ఈటీవీ కి మాత్రమే పరిమితమయ్యేవి. కాలక్రమేణా దానిని జెమిని, స్టార్ మా, జీ టీవీ అందిపుచ్చుకున్నాయి. ప్రస్తుతం స్టార్ మా, జీ టీవీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది.. ఒకప్పుడు బుల్లితెరకు సీరియల్స్ పరిచయం చేసిన ఈటీవీ ఈ రేసులో వెనుకబడి ఉంది.. ఇక ఆ జెమిని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

Troll Of The Day
సీరియల్స్ ప్రసారం తోనే సరిపోదు కనుక.. వాటికి టిఆర్పి రేటింగ్స్ కూడా కావాలి కనుక.. టిఆర్పి రేటింగ్స్ ఉంటేనే యాడ్స్ వస్తాయి కనుక..అన్ని సీరియల్స్ కార్తీకదీపం కావు కనుక.. సీరియల్స్ తీసే దర్శకులు.. నిర్మించే నిర్మాతలు కొత్త పుంతలకు పోతున్నారు.. తీసే విధానంలో ఈ కొత్త మంచిదే.. కానీ ఆ కొత్త బెడిసి కొట్టి అతి అయితేనే ఇబ్బంది.. ప్రేక్షకులకు కూడా పెద్ద తలనొప్పి..
ఈటీవీలో కనిపించే రోహిణి పాత్రధారిగా ఓ సీరియల్ లో నటించింది. ఇందులో తన భర్తతో కలిసి గుడికి వెళుతుంది.. అక్కడ అతని నుదుటికి గురి చూసి ఎవరో ప్రత్యర్థి తుపాకీతో కాల్చుతారు.. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు.. అకస్మాత్తుగా కళ్ళముందే తుపాకీ తూటా భర్త నుదుటి లోకి దూసుకెళ్ళడంతో భార్య కంగారు పడుతుంది.

Troll Of The Day
అయ్యో అంటూ కేక వేస్తుంది. పూజారి కూడా భయపడతాడు.. కింద పడిపోయిన భర్త ను భార్య ఒడిలో పడుకోబెట్టుకుంటుంది.. అప్పుడే భర్త పూజారిని ప్రసాదం పెట్టమంటాడు.. ఆ ప్రసాదాన్ని భర్త నోట్లో పెడుతుంది భార్య.. అది తిన్న భర్త పులిహోరలో ఉప్పు తక్కువ ఉందని అంటాడు.. ఇది చూసేందుకు ఎంత అతిగా ఉందంటే… సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. నుదుటిపై బుల్లెట్ గాయం చేసినా బతికి ఉన్నాడంటే మామూలు విషయం కాదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.