Minister Malla Reddy Troll: ట్రోల్ ఆఫ్ ది డే : మంత్రి మల్లారెడ్డిని ఓ రేంజ్‌లో ఆడుకున్న అమ్మాయి!
Minister Malla Reddy Troll: మల్లారెడ్డి.. పరిచయం అక్కరలేని పేరు. వ్యాపారిగా, విద్యాసంస్థల అధినేతగా ఎదిగిన మల్లారెడ్డి.. రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. కొన్ని నెలలుగా మల్లారెడ్డి ఏది మాట్లాడినా ట్రోల్ అవుతోంది. మల్లారెడ్డి కామెడీ మంత్రి అని సొంతపార్టీ నేతలే చెబుతారు. అయితే తన భజన.. కాకుంటే కేసీఆర్, కేటీఆర్ భజన చేయడం ద్వారా మల్లారెడ్డి కామెడియన్‌గా మారారు. ఇటీవల జరిగిన ఐటీ దాడుల సందర్భంగా […]


Minister Malla Reddy Troll
Minister Malla Reddy Troll: మల్లారెడ్డి.. పరిచయం అక్కరలేని పేరు. వ్యాపారిగా, విద్యాసంస్థల అధినేతగా ఎదిగిన మల్లారెడ్డి.. రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. కొన్ని నెలలుగా మల్లారెడ్డి ఏది మాట్లాడినా ట్రోల్ అవుతోంది. మల్లారెడ్డి కామెడీ మంత్రి అని సొంతపార్టీ నేతలే చెబుతారు. అయితే తన భజన.. కాకుంటే కేసీఆర్, కేటీఆర్ భజన చేయడం ద్వారా మల్లారెడ్డి కామెడియన్‌గా మారారు. ఇటీవల జరిగిన ఐటీ దాడుల సందర్భంగా మల్లారెడ్డి చేసిన ఓవరాక్షన్‌తో మరింత కమెడియన్ అయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన ఏది మాట్లాడినా అది కామెడీగానే అనిపిస్తోంది. దీంతో యూత్ ఆయనను తెగ ట్రోల్ చేస్తోంది.
ట్రోలింగ్‌ను పాజిటివ్‌గా తీసుకున్న మల్లారెడ్డి..
తాము అన్న మాటలను నెట్టింట్లో ట్రోల్ చేస్తే అధికార పార్టీనేతలు పోలీసులతో కేసులు పెట్టిస్తుండగా.. సోషల్ మీడియాలో నెటిజన్లు మల్లారెడ్డిని సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్‌ను కూడా మంత్రి పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో నేను ఏది మాట్లాడినా సోషల్ మీడియాలో తుపాను సృష్టిస్తోంది అని వ్యాఖ్యానించారు. దీంతో నెటిజన్లు ఇక రెచ్చిపోతున్నారు..

Minister Malla Reddy Troll
ఆటాడుకున్న అమ్మాయి..
తాజాగా ఓ అమ్మాయి మంత్రి మల్లారెడ్డిని ఓ ఆటాడుకుంది. ఆయన ఎక్కడ మీటింగ్ జరిగినా చెప్పే మాటలనే తనదైన శైలిలో సెటైరికల్‌గా చెప్పిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ‘‘మల్లారెడ్డి అంటే ఎవరూ.. అదృష్టం.. పాలమ్మిన, పూలమ్మిన.. కష్టపడ్డ. వ్యాపారం చేసిన.. లబ్బర్ చెప్పులు వేసుకున్న.. మెడికల్ కాలేజీలు పెట్టిన.. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న, పేద పిల్లలకు స్కారల్‌షిప్‌పై చదువు చెబుతున్న’’ అనే డైలాగ్‌తో అమ్మాయి చేసిన రీల్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. అందులో లాస్ట్ పంచ్ సూపర్‌గా ఉంది. మల్లారెడ్డి చెప్పినట్లుగానే ‘‘లో ప్రొఫైల్.. హై థికింగ్’’ వావ్ అనిపిస్తుంది. లాస్ట్ పంచ్ మనదైనే ఆ కిక్కే వేరప్పా అన్నట్లుగా అమ్మాయి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
View this post on Instagram
