Troll Of The Day: ఇల్లాలిని చూసాకే ఇల్లు అందం తెలుస్తుందట… అలాగే పాలకుడిని చూసి నాకే.. రాజ్యం దమ్మెంతో తెలుస్తుందట… నాయకుడికి సత్తా లేక పోతే రాజ్యం కూడా చతికిల పడుతుందట.. పాపం ఆంధ్రప్రదేశ్ విషయంలో పైవన్నీ జరుగుతున్నాయి.. జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం పేరుతో గద్దెనెక్కి నాలుగేళ్లు గడిచిపోయాయి.. భారీ ప్రాజెక్టు లేదు.. భారీగా ఆదాయం వచ్చే అవకాశం లేదు.. విలువైన వనరులు ధార దత్తమవుతున్నాయి..రుషికొండ మొదలుకొని కృష్ణపట్నం పోర్టు వరకు ఎవరికీ దక్కాలో వారికి దక్కుతున్నాయి.. ఇలాంటి సందర్భంలో రాష్ట్రం గురించి ఎవరైనా మాట్లాడితే, ఆర్థిక పరిస్థితి గురించి ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే పోలీసులు కాపు కాసుకుని చేతులకు బేడీలు వేస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో మక్కెలు ఇరగ దంతున్నారు. ప్రతిపక్షం, స్వపక్షం అని తేడా లేదు.. ఎదురు తిరిగితే ఇక అంతే సంగతులు.

Troll Of The Day
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది సలహాదారులు నియమితులయ్యారో ఆయనకే తెలియదు. తనకు అధికారం లభించడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ఏదో ఒక పోస్ట్ ఆయన కల్పించారు.. రాష్ట్రంలో కేబినెట్లో ఉన్న మంత్రుల కంటే సలహాదారులు ఎక్కువ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో బరితెగించారో అర్థం చేసుకోవచ్చు.. సర్కార్ కు పెద్దగా ఇన్కమ్ సోర్స్ లేకపోయినప్పటికీ అప్పులు తెచ్చి ప్రజలకు పప్పు బెల్లల్లా పంచుతున్నారు.. మొత్తానికి మరో వెనిజులా ఉదంతాన్ని కళ్ళకు కడుతున్నారు.
ఆమధ్య పవన్ కళ్యాణ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర నిర్వహించాలని అనుకున్నారు.. ఇందులో భాగంగా వారాహి అనే వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు.. ఈ వాహన రిజిస్ట్రేషన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరాకరించడంతో ఆయన తెలంగాణలో చేసుకోవలసి వచ్చింది.. ఈ ఉదాహరణ చాలు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి భయానక పరిస్థితి ఉందో… ఇక తనకు గిట్టని ఛానళ్ళు, పత్రికలపై జగన్ యుద్ధం ప్రకటిస్తూనే ఉన్నారు.

Troll Of The Day
వాటి యాజమాన్యాలకు నరకం చూపిస్తూనే ఉన్నారు.. ఇది ఎంతకు దారి తీస్తుందో తెలియదు కానీ… ప్రస్తుతానికి అయితే జగన్మోహన్ రెడ్డి సర్కారు, ఆయన అనుసరిస్తున్న అవినీతి విధానాలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. రెడ్డిగారు వచ్చారు.. మొదలుపెట్టండి అంటూ క్రియేట్ చేసిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.