Troll Of The Day: మన కళ్ళ ముందు ఎవరైనా ప్రాణాలు కోల్పోతే అయ్యో అంటాం.. వారు విలవిలలాడుతుంటే కన్నీరు కారుస్తాం. చేతనయినంత సహాయం చేస్తాం. అది మానవ నైజం.. కానీ చావులో కూడా ప్రయోజనం వెతుక్కోము. కొందరు ఉంటారు తమ ప్రయోజనం కోసం ఏదైనా చేస్తారు.. ఎంతకైనా తెగిస్తారు.. కుటుంబ సభ్యుల ప్రస్తావన తీస్తారు.. ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు కారుస్తారు.. అలాంటి వారిలో 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు ముందు ఉంటాడు.. మామకు వెన్నుపోటు పొడిచినా, పుష్కరాలలో జనం చనిపోయినా, తన సభలకు వచ్చి జనం కన్నుమూసినా లెక్కలేసుకుంటాడు. అందులో చనిపోయిన వారు ఏ కులాలకు చెందినవారు లెక్క కడతాడు.. దీనిని ఆయన భజన మీడియా అహో ఓహో అంటూ చెప్పేస్తుంది. జనాల చెవులకు చిల్లులు పడేలా డప్పేస్తుంది.

Troll Of The Day
మొన్న నెల్లూరు, గుంటూరు జిల్లాలో చంద్రబాబు సభలు పెడితే 11 మంది కన్నుమూశారు.. ఇందులో నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.. ప్రభుత్వం ఇలాంటివి మళ్లీ జరగకూడదని జీవో :1 విడుదల చేసింది. పోనీ ఆ జీవోకు అధికార పార్టీ నాయకులు కట్టుబడి ఉన్నారా అంటే లేదు.. కేవలం ప్రతిపక్షాలను తొక్కిపెట్టేసి.. తాము మాత్రం దర్జాగా సభలు నిర్వహించుకుంటున్నారు. ఏపీ అంటేనే అంత.. ఇక ఈ విషయంలో ఎల్లో మీడియా చేస్తున్న ఈ యాగి అంతా ఇంతా కాదు. ఏకంగా చంద్రబాబు నాయుడిని తొక్కేసేందుకు అధికార పార్టీ జీవో ఒకటి పేరుతో ఉక్కు పాదం మోపుతోందని తేల్చిపడేసింది. ఇక చంద్రబాబు భజనలో ఆరి తేరిన ఏబీఎన్.. ఏకంగా దీనిపై డిబేట్ పెట్టింది.. అంతే కాదు దీనికి నరసాపురం వైఎస్ఆర్సిపి పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణం రాజు ను పిలిచింది. తను ఎలాగూ చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతాడు కాబట్టి ఈసారి కూడా అదే పల్లవి అందుకున్నాడు. వాస్తవానికి తాను టెక్నికల్ గా వైఎస్ఆర్సిపి ఎంపీ, మాట్లాడేది మాత్రం జగన్ కు వ్యతిరేకంగా. పచ్చ మీడియా కూడా ఇదే కావాలి కాబట్టి… ఆయనను బాగా ఫోకస్ చేస్తాయి.. ఇదే సమయంలో జగన్ అతడిని బయటికి పంపలేడు. ఇన్ని ఏళ్ళు గడిచినప్పటికీ ఇంతవరకు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఇక చావులో కూడా కులం వెతుక్కోవడం చంద్రబాబుకే చెల్లింది.. తన సభలకు వచ్చినవారు తొక్కిసలాటకు గురై కన్నుమూస్తే వారిలో ఎంతమంది బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, ఓసీలు ఉన్నారో లెక్క గడుతున్న చంద్రబాబు.. వారి కుటుంబాలకు కించిత్ క్షమాపణ కూడా చెప్పలేదు.. వారేదో వారి కర్మానికి వచ్చినట్టు, వారి కర్మకొద్దీ చచ్చినట్టు చెప్పుకుంటూ పోయాడు.. అంతేకానీ సభలో నిర్వహణలోపం ఉందని చెప్పలేకపోయాడు.. పైగా ప్రభుత్వానికి తప్పు అంటూ రివర్స్ క్వశ్చన్ వేశాడు. ఇలాంటివి చూస్తే పచ్చ మీడియాకు కడుపునిండావచ్చుగాక.. కానీ సామాన్య జనానికి కడుపు మండుతుంది.. ఈ కడుపు మంటే 2019లో 23 దాకా తీసుకొచ్చింది.. ఈసారి ఏం చేస్తుందో వేచి చూడాలి.