బాలీవుడ్ పై కన్నేసిన త్రివిక్రమ్?

టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవలే ‘అల.. వైకుంఠపురములో’ మూవీతో బాక్సాఫీసు రికార్డులు సృష్టించాడు. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లలో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. మహేష్ బాబు నటించిన ‘సరిలేరునికెవ్వరు’, రజనీకాంత్ ‘దర్బార్’లను తట్టుకొని పాజిటివ్ దక్కించుకుంది. తెలుగు, మళయాళంతోపాటు యూకేలోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది. తెలుగులో నాన్ బహుబలి రికార్డు దక్కించుకుంది. దీంతో ఈ మూవీని బాలీవుడ్లో తీసేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఈ మూవీని బాలీవుడ్లోనూ త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నట్లు […]

  • Written By: Neelambaram
  • Published On:
బాలీవుడ్ పై కన్నేసిన త్రివిక్రమ్?

టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవలే ‘అల.. వైకుంఠపురములో’ మూవీతో బాక్సాఫీసు రికార్డులు సృష్టించాడు. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లలో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. మహేష్ బాబు నటించిన ‘సరిలేరునికెవ్వరు’, రజనీకాంత్ ‘దర్బార్’లను తట్టుకొని పాజిటివ్ దక్కించుకుంది. తెలుగు, మళయాళంతోపాటు యూకేలోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది. తెలుగులో నాన్ బహుబలి రికార్డు దక్కించుకుంది. దీంతో ఈ మూవీని బాలీవుడ్లో తీసేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఈ మూవీని బాలీవుడ్లోనూ త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

తెలుగులో హిట్టయిన సినిమాలన్నీ బాలీవుడ్లో రీమేక్ అవుతుంటాయి. తెలుగు రీమేక్ మూవీలకు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. ఈ కోవలోనే ‘అల.. వైకుంఠపురములో’ మూవీ బాలీవుడ్ బాటపట్టనుంది. బాలీవుడ్ కు చెందిన ఓ నిర్మాణ సంస్థ ఏకంగా ఏడుకోట్ల చెల్లించేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. అయితే ఈ సినిమాను బాలీవుడ్లో నిర్మించేందుకు అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ నిర్మాణంలో త్రివిక్రమ్, రాధాకృష్ణ భాగస్వాములుగా ఉంటారని సమాచారం. ఈ మూవీతో త్రివిక్రమ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కన్పిస్తుంది.

ప్రస్తుతం అల్లు అరవింద్ తెలుగులో ఘనవిజయం సాధించిన ‘జెర్సీ’ మూవీని బాలీవుడ్లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ పూర్తయిన వెంటనే ‘అల..వైకుంఠపురములో’ పట్టాలెక్కించేందుకు అల్లు అరవింద్ సన్నహాలు చేస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ నటిస్తారని ప్రచారం జరుగుతుంది. అలాగే ఈ మూవీని అదిరిపోయే బాణీలు సమకూర్చిన థమన్ బాలీవుడ్లోనూ మ్యూజిక్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తన మాటలతో, దర్శకత్వ ప్రతిభతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.

సంబంధిత వార్తలు