Trivikram Srinivas- Thaman: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో కొత్త సినిమా మేకింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షెడ్యూల్ పదే పదే మిస్సవుతోంది. కథలో మార్పు, మహేశ్ కుటుంబ సభ్యుల మరణాలతో ఈ సినిమా ఆలస్యమవుతోంది. అయితే ఇటీవల మహేశ్ సూచించిన ప్రకారం గా మాటల మాంత్రికుడు స్టోరీని మార్చేశాడు. అయితే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా రీ ప్లేస్ చేసినట్లు సమాచారం. అంతకుముందు SSMB 28 సినిమా కోసం థమన్ ను అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయనను పక్కనపెట్టి ఆయన ప్లేసులో అనిరుద్ ను తీసుకోబోతున్నారు. ఈ విషయంపై తివిక్రమ్ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు. దీంతో రాను రాను ఈ సినిమా కోసం ఎన్ని మార్పులు జరుగుతాయోనని ఫ్యాన్స్ కాస్త నిరాశతో ఉన్నారు.

Trivikram Srinivas- Thaman
‘సర్కారు వారి పాట’ తరువాత మహేశ్ SSMB 28 సినిమాకు సైన్ చేశాడు. త్రివిక్రమ్ దీనికి డైరెక్టర్. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే అతడు, ఖలేజా వచ్చిన విషయం తెలిసిందే. మహేశ్ బాబ కెరీర్లోనే అతడు మైలురాయి లాంటిది. అందుకే త్రివిక్రమ్ సినిమాకు ఏమాత్రం ఆలోచించకుండా మహేశ్ వెంటనే ఓకే చెప్పాడు. అయితే కొంతకాలం తరువాత త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ లైన్ మహేశ్ క నచ్చలేదట. ఈ విషయంపై మాటల మాంత్రికుడికి కొన్ని సూచలను కూడా చేశారట. దీంతో స్టోరీని మార్చడానికి త్రివిక్రమ్ కాస్త టైం తీసుకున్నాడు. దీంతో సినిమా రెగ్యులర్ షూటింగ్ కావడం లేదు.
మొత్తానికి మహేశ్ సూచించిన విధంగా స్టోరీని మార్చేశాడు త్రివిక్రమ్. అయితే ఇటీవల మహేశ్ ఇంట వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయన తల్లి మరణించిన కొద్ది రోజులకే తండ్రి కృష్ణ మరణించాడు. దీంతో మరింత ఆలస్యం కానుంది. వాస్తవానికి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరిగితే SSMB 28 నుంచి ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి ఆగస్టుకు వాయిదా వేసినట్ల తెలుస్తోంది. ఈ సినిమా షెడ్యూల్ పోస్ట్ పోన్ కారణంగా మహేశ్ కు చెందిన మరికొన్ని సినిమాల షెడ్యూల్ వాయిదా పడుతున్నాయి. అయితే మహేశ్ ఈసారి ఆలస్యం చేయకుండా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననున్నారు.

Trivikram Srinivas- Thaman
ఇదిలా ఉండగా తాజాగా త్రివిక్రమ్ SSMB 28కి మ్యూజిక్ డైరెక్టర్ ను రీప్లేస్ చేశాడు. అంతకుముందు ఈ సినిమా కోసం థమన్ ను అనుకున్నారు. కానీ ఇప్పుడు కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుద్ కు అవకాశం ఇవ్వనున్నారు. త్రివిక్రమ్, థమన్ కాంబోలో అలా వైకుంఠపురం, అరవింద సమేత సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు సక్సెస్ గా నిలిచాయి. కానీ ప్రస్తతం థమన్ ను పక్కనబెట్టడంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. మరోవైపు అనిరుద్ మహేశ్ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ అందిస్తాడోనని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.