Mahesh Trivikram : సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మూడవ సినిమా తెరకెక్కబోతుంది అనే విషయం అందరికి తెలిసిందే..ఎప్పుడో పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడానికి మాత్రం అనే అడ్డంకులు ఎదురు అవుతున్నాయి..ఒకానొక దశలో అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు కూడా అభిమానుల్లో వచ్చింది..ఆ వార్తలు వైరల్ అయ్యినప్పుడు వెంటనే మూవీ టీం స్పందించి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ చెయ్యబోతున్నాము అని క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Mahesh -Trivikram
అయితే మొదటి షెడ్యూల్ లో మహేష్ మీద ఒక చిన్న ఫైట్ సీన్ ని తెరకెక్కించాడు త్రివిక్రమ్..కానీ మహేష్ బాబు కి ఔట్పుట్ అసలు నచ్చలేదు..కథ మీద కూడా ఎందుకో ఆయనకీ అనుమానం కలిగింది..అందుకే వెంటనే షూటింగ్ ఆపేసి , వేరే కొత్త కథ తో త్వరలోనే షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నాడు..డిసెంబర్ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని అందరూ అనుకున్నారు.
కానీ ఈ సినిమాకి హీరోయిన్ పూజ హెగ్డే రూపం లో మరో సమస్య వచ్చింది..ఆమె డేట్స్ సర్దుబాటు కాకపోవడం తో మూవీ షూటింగ్ ని వాయిదా వేసేశాడు త్రివిక్రమ్..ఇప్పటి వరుకు టాలీవుడ్ హిస్టరీ లో ఒక హీరోయిన్ కోసం షూటింగ్ ని ఆపివేయడం వంటివి ఎప్పుడూ జరగలేదు..మొదటిసారి అలాంటి పరిణామం మహేష్ సినిమా విషయం లో చోటు చేసుకోవడం తో ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై మండిపడుతున్నారు.
పూజ హెగ్డే కోసం షూటింగ్ ని ఆలస్యం చేస్తావా..ఆమె లేకపోతే మరో హీరోయిన్ ఎవ్వరూ లేరా ఇండస్ట్రీ లో..ఎందుకు పూజ హెగ్డే మీద అంత ఆసక్తి అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ ని సోషల్ మీడియా లో బండబూతులు తిడుతున్నారు ఫ్యాన్స్..ప్రస్తుతం మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ దుబాయి లోని ఒక హోటల్ లో కూర్చొని సాంగ్స్ మొత్తం పూర్తి చేశారట..సాంగ్స్ అద్భుతంగా వచ్చాయట..చూడాలి మరి ఈ క్రేజీ కాంబినేషన్ అభిమానులను ఎలా అలరిస్తుంది అనేది.