బన్నీని వదలనుంటున్న త్రివిక్రమ్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరోమూవీ రానుంది. తాజాగా వీరి కాంబినేషన్లో వచ్చిన ‘అలవైకుంఠపురములో’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. సంక్రాంతి కానునగా రిలీజైన ‘అలవైకుంఠపురములో’ మహేష్ బాబు ‘సరిలేరునికెవ్వరు’, రజనీకాంత్ ‘దర్బార్’ మూవీలను తట్టుకొని బాక్సాఫీస్ రికార్డులు సృష్టించింది. అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. గతంలో త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్లలో వచ్చిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ మంచి విజయాన్ని సాధించింది. తాజాగా అల్లు అర్జున్ […]

  • Written By: Neelambaram
  • Published On:
బన్నీని వదలనుంటున్న త్రివిక్రమ్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరోమూవీ రానుంది. తాజాగా వీరి కాంబినేషన్లో వచ్చిన ‘అలవైకుంఠపురములో’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. సంక్రాంతి కానునగా రిలీజైన ‘అలవైకుంఠపురములో’ మహేష్ బాబు ‘సరిలేరునికెవ్వరు’, రజనీకాంత్ ‘దర్బార్’ మూవీలను తట్టుకొని బాక్సాఫీస్ రికార్డులు సృష్టించింది. అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. గతంలో త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్లలో వచ్చిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ మంచి విజయాన్ని సాధించింది.

తాజాగా అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ తో ఓ మూవీ చేస్తున్నాడు. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుది. ఈ మూవీలో బన్నీతొలిసారి డ్యూయల్ రోల్స్ చేస్తున్నాడు. ఒక పాత్రలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. బన్నీకి జోడీగా రష్మిక మందన్న ఎంపికైనట్లు సమాచారం.

సుకుమార్ మూవీ తర్వాత బన్నీ త్రివిక్రమ్‌ సినిమాలో నటించనున్నాడు. ఇప్పటికే బన్నీకోసం మంచి కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అలాగే త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తివిక్రమ్ కలిసి పని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్టార్ హీరోలందరూ త్రివిక్రమ్ తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఆ తర్వాతే మెగా హీరోలతో సినిమా ఉండనుందని సమాచారం.

సంబంధిత వార్తలు