Trisha: ఆ డైరెక్టర్ పోస్ట్ కి పది సంవత్సరాల తరువాత రిప్లై ఇచ్చిన త్రిష…

ఇక రెండు దశాబ్దాలకు పైగా చిత్రసీమను ఏలుతున్న త్రిష ఈ మధ్య పొన్నియన్ సెల్వన్ సినిమా తరువాత మరిన్ని అవకాశాలు దక్కించుకుంటొంది. కాగా ప్రస్తుతం ఈ హీరోయిన్ చేసిన ఒక పని మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది.

  • Written By: Vishnupriya
  • Published On:
Trisha: ఆ డైరెక్టర్ పోస్ట్ కి పది సంవత్సరాల తరువాత రిప్లై ఇచ్చిన త్రిష…

Trisha: ఎన్ని సంవత్సరాలు అయినా తరగని అందం త్రిష సొంతం. నీ మనసు నాకు తెలుసు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ తమిళ ముద్దుగుమ్మ…ఆ తరువాత వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది.

ఇక రెండు దశాబ్దాలకు పైగా చిత్రసీమను ఏలుతున్న త్రిష ఈ మధ్య పొన్నియన్ సెల్వన్ సినిమా తరువాత మరిన్ని అవకాశాలు దక్కించుకుంటొంది. కాగా ప్రస్తుతం ఈ హీరోయిన్ చేసిన ఒక పని మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది.

అసలు విషయానికి వస్తే తెలుగులో ఎన్నో గుర్తుంది పోయే చిత్రాలలో నటించింది త్రిష.. అలాంటి సినిమాలలో వెంకటేష్ హీరోగా నటించిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమా కూడా ఒకటి అని చెప్పాలి. ఇక ఈ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సెల్వ రాఘవ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో యూత్ని అలానే ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాని తమిళంలో ధనుష్ హీరోగా పెట్టి కూడా తీసారు ఈ డైరెక్టర్. అయితే ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సినిమాకు సీక్వల్ తీయాలని అనుకున్నాడు దర్శకుడు సెల్వ రాఘవన్. 2013లో సీక్వల్ తీయాలి అనుకుంటున్నాను అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ పెట్టి దాదాపు పది సంవత్సరాలు అయిపోగా, ఇప్పుడు దర్శకుడు పెట్టిన పోస్ట్ కి రిప్లై ఇచ్చింది త్రిష.

మీరు విన్నది నిజమే. ఎప్పుడో పది సంవత్సరాలు ముందు పెట్టిన పోస్ట్ కి ఇప్పుడు త్రిష రిప్లై ఇస్తూ.. నేను కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ పెట్టేసింది. కొంతమంది ఏమో ఈ రిప్లై చూసి ఒకవేళ డైరెక్టర్ ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారేమో మొత్తానికి హిట్ మూవీ లోడింగ్ అంటూ కామెంట్లు చేస్తుండగా ..మరి కొంతమంది మాత్రం రిప్లై ఇవ్వడం విషయంలో మరి ఇంత లేట్ ఏంటి మేడం అంటూ త్రిష ని ప్రశ్నిస్తున్నారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు