Trisha : స్టార్ హీరో కి తల్లిగా నటించబోతున్న త్రిష..ఇదేమి ఖర్మ అండీ బాబోయ్!

తెలుగు లో చిరంజీవి మరియు సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్నారు. ఇందులో వీళ్లిద్దరు తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారు. చిరంజీవి కి జోడిగా త్రిష నటిస్తుండగా, సిద్దు కి జోడిగా శ్రీలీల చేస్తుంది. చిరంజీవి మరియు త్రిష లకు కొడుకుగా సిద్దు నటించబోతున్నాడు, దీనిని ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి.

  • Written By: Vicky
  • Published On:
Trisha : స్టార్ హీరో కి తల్లిగా నటించబోతున్న త్రిష..ఇదేమి ఖర్మ అండీ బాబోయ్!

Trisha : దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగే అదృష్టం అందరికీ రాదు,కేవలం కొంత మందికి మాత్రమే ఆ అదృష్టం లభిస్తుంది. అలాంటి అదృష్టం దక్కించుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు త్రిష. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి ఈమె. ఆ తర్వాత సౌత్ లో ఆమె నటించని స్టార్ హీరో అంటూ ఎవ్వరూ మిగలలేదు.

సీనియర్ హీరోల దగ్గర నుండి నేటి తరం హీరోలలో అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ తో మినహా, ప్రతీ హీరో సరసన నటించింది. అయితే కొత్తవాళ్ళ రాకవల్ల ఈమె రేంజ్ కొంతకాలం వరకు తగ్గింది. కేవలం సీనియర్ హీరోలు మాత్రమే అవకాశాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఈమె యంగ్ హీరోయిన్స్ తో పోటీగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. రీసెంట్ గానే పొన్నియన్ సెల్వన్ సిరీస్ తో వరుసగా రెండు సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుతం ఇంతటి పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్న త్రిష, ఇప్పుడు ఒక యంగ్ హీరోకి తల్లిగా నటించేందుకు ఒప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ చిత్రం తర్వాత కళ్యాణ్ కృష్ణ తో ఒక సినిమా, మరియు వశిష్ఠ తో మరో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వీటిల్లో ముందుగా కళ్యాణ్ కృష్ణ తో చెయ్యబొయ్యే సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

ఇది మలయాళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘బ్రో డాడీ’ కి రీమేక్, మలయాళం లో మోహన్ లాల్ మరియు పృద్విరాజ్ సుకుమారన్ నటించగా , తెలుగు లో చిరంజీవి మరియు సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్నారు. ఇందులో వీళ్లిద్దరు తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారు. చిరంజీవి కి జోడిగా త్రిష నటిస్తుండగా, సిద్దు కి జోడిగా శ్రీలీల చేస్తుంది. చిరంజీవి మరియు త్రిష లకు కొడుకుగా సిద్దు నటించబోతున్నాడు, దీనిని ఆడియన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి.

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు