Manchu Vishnu vs Manoj : బ్రేకింగ్: మనోజ్ తో గొడవ, పూర్తి వీడియో విడుదల చేసిన విష్ణు… జనాలు షాక్!

Manchu Vishnu vs Manoj నటుడు మోహన్ బాబు కొడుకుల మధ్య గొడవవలంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మనోజ్ ఏకంగా ఓ వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం సంచలనమైంది. ఆ వీడియోలో విష్ణు దాడి చేస్తున్నట్లుగా ఉంది. మా వాళ్ళ మీద విష్ణు దాడి చేస్తున్నాడు, ఇదీ సిట్యుయేషన్ అంటూ… మనోజ్ కామెంట్ చేశారు. విష్ణు-మనోజ్ మధ్య గొడవలు రచ్చకెక్కాయంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గత ఆరు నెలలుగా కుటుంబంతో మనోజ్ కి వివాదాలు […]

Written By: NARESH, Updated On : March 30, 2023 8:27 pm
Follow us on

Manchu Vishnu vs Manoj నటుడు మోహన్ బాబు కొడుకుల మధ్య గొడవవలంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మనోజ్ ఏకంగా ఓ వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం సంచలనమైంది. ఆ వీడియోలో విష్ణు దాడి చేస్తున్నట్లుగా ఉంది. మా వాళ్ళ మీద విష్ణు దాడి చేస్తున్నాడు, ఇదీ సిట్యుయేషన్ అంటూ… మనోజ్ కామెంట్ చేశారు. విష్ణు-మనోజ్ మధ్య గొడవలు రచ్చకెక్కాయంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గత ఆరు నెలలుగా కుటుంబంతో మనోజ్ కి వివాదాలు అంటూ ఊహాగానాలు ఉన్నాయి. ఇక మౌనికను వివాహం చేసుకోవడం ఇష్టం లేని మోహన్ బాబు, విష్ణు మనోజ్ మీద గుర్రుగా ఉన్నారన్న వాదన వినిపించింది.

మనోజ్ వివాహానికి విష్ణు రాలేదు. మోహన్ బాబు కూడా చివరి నిమిషంలో వచ్చి మనోజ్-మౌనికలను ఆశీర్వదించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మనోజ్ పోస్ట్ చేసిన వీడియో సంచలనమైంది. అయితే అందరికీ షాక్ ఇస్తూ… ఇది ఫ్రాంక్ అంటూ విష్ణు ఓ ప్రోమో విడుదల చేశారు. ‘హౌస్ ఆఫ్ మంచూస్’ పేరుతో ఓ రియాలిటీ షో స్టార్ట్ చేస్తున్నారట. ఈ షో ప్రచారంలో భాగంగా మనోజ్-విష్ణు కలిసి ఈ ఫ్రాంక్ చేశారట. మనోజ్ పోస్ట్ చేసిన ‘హౌస్ ఆఫ్ మంచూస్’ప్రోమో వైరల్ అవుతుంది.

ఏంటి ఒక షో కోసం ఇంత హైడ్రామా చేశారా? జనాలను పిచ్చోళ్ళు చేశారా? అంటూ వాపోతున్నారు. మరికొందరు మాత్రం… జరిగిన డామేజ్ ని ఇలా కవర్ చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. మంచు బ్రదర్స్ మధ్య విభేధాలంటూ, మోహన్ బాబు పరువు బజారుకీడ్చారంటూ దారుణమైన కథనాలు వెలువడ్డాయి. చెప్పాలంటే మోహన్ బాబు ఇమేజ్ భారీగా దెబ్బతింది.ఈ క్రమంలో కోట్లు పోయినా పర్లేదు ఇదంతా అబద్దమని నిరూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ఇలా హౌస్ ఆఫ్ మంచూస్ అంటూ రియాలిటీ షో తెరపైకి తెచ్చారని అంటున్నారు.

ఇక నిజం ఏమిటనేది నిలకడ మీద తెలియాల్సి ఉంది. ఇక ఈ హౌస్ ఆఫ్ మంచూస్ షో కాన్సెప్ట్ ఏమిటీ? కంటెస్టెంట్స్ ఎవరు? ఎక్కడ ప్రసారం అవుతుంది? వంటి వివరాలు తెలియాల్సి ఉంది. జనాలకు మాత్రం ఇది బిగ్ షాక్. కుటుంబ పరువు, ప్రతిష్ట మీద కూడా ఫ్రాంక్ చేస్తారా! అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా మనోజ్ ఇటీవల ‘వాట్ ది ఫిష్’ టైటిల్ తో మూవీ ప్రకటించారు. విష్ణు జిన్నా అనంతరం కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు.