Site icon OkTelugu

Visakha Purnananda Swamy: కాళ్లకు గొలుసులు కట్టి.. బాలికపై రెండేళ్లుగా ఈ స్వామీజీ చేసిన పాడు పని ఇదీ

Visakha Purnananda Swamy

Visakha Purnananda Swamy

Visakha Purnananda Swamy: స్వామీజీల ముసుగులో అరాచకాలు చేసేవారి సంఖ్య పెరగుతోంది. డేరాబాబా, నిత్యానంద స్వామీజీల ఘటన తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న స్వామీజీలు మళ్లీ ఆ ముసుగులో అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా విశాఖపట్నంలో ఓ స్వామీజీ 12 ఏళ్ల బాలికై లైంగికదాడి చేశాడు. కాళ్లకు గొలుసులు కట్టేసి మరీ చిత్రహింసలు పెట్టాడు. ఆశ్రమం నుంచి తప్పించుకుని వచ్చిన బాలిక పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది.

తల్లిదండ్రును కల్పోయి..
రాజమహేంద్రవరానికి చెందిన ఒక బాలిక(15)కు చిన్నతనంలోనే పేరెంట్స్‌ చనిపోయారు. దీంతో ఆమెను బంధువులు ఐదో తరగతి దాకా చదివించి.. రెండేళ్ల కింద విశాఖలోని కొత్త వెంకోజీపాలెం దగ్గర ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో సేవల కోసం పంపించారు.

పగలు పనులు.. రాత్రి పడక..
ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీ ఆ బాలికతో ఆవులకు మేత వేయించడం, పేడ తీయడం లాంటి పనులు చేయించేవాడు. అర్ధరాత్రి బాలికను తనతోపాటు రూమ్కు తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు.

గొలుసులతో బంధించి..
ఏడాది నుంచి బాలిక కాళ్లకు గొలుసు వేసి బంధించాడు. కనీసం కాలకృత్యాలకు కూడా అనుమతించేవాడు కాదు. ఇలా రెండేళ్లుగా బాలికను చిత్రహింసలకు గురిచేశాడు. ఆమె ఎదురుతిరిగితే కొట్టేవాడు. ఆ బాలికకు ఆకలేస్తే రెండు చెంచాల అన్నం మాత్రమే నీటితో కలిపి పెట్టేవాడు. రెండు వారాలకు ఓసారి మాత్రమే స్నానానికి వెళ్లాల్సి వచ్చేది. ఈనెల 13వ తేదీన పనిమనిషి సాయంతో బాధితురాలు ఆశ్రమం నుంచి బయటపడింది. స్వామీజీ తనను చిత్రహింసలకు గురిచేసిన విషయాన్ని కంకిపాడు పోలీసులకు వివరించింది. దీంతో బాలికను విజయవాడలోని దిశ పోలీసు స్టేషన్కు పంపారు. పూర్ణానంద స్వామీజీపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత బాలికను వైద్య పరీక్షల కోసం విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విశాఖ పోలీసులు స్వామీజీని అరెస్ట్‌ చేశారు.

Exit mobile version