
ఓవైపు ఎండాకాలం మంట.. మరోవైపు కరోనా తెచ్చిన తంటా.. ఈ రెండింటి మధ్య బయటకు వెళ్లాలంటేనే భయం. అయితే మన తారలు మాత్రం దగ్గరలో సముద్రంలో ఉన్న మల్దీవులకు వెళ్లి సేదతీరుతున్నారు. కరోనా లాక్ డౌన్ తో ఎంతో ఇబ్బందిపడ్డ ఇండస్ట్రీ ప్రముఖులు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు.
టాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరొందింది శ్రద్ధదాస్. మంచి నాటు పాత్రలు సినిమాల్లో చేసే ఈ ముద్దుగుమ్మ తన అందచందాలను ఆరబోస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో భయటకెళ్లాలంటే భయమే. ఎందుకంటే కరోనా వైరస్ జెట్ స్పీడుతో విస్తరిస్తోంది. గతేడాది వైరస్ ప్రభావంతో ఏర్పడిన లాక్డౌన్ తో సినీ ప్రముఖులు , సామాన్యులు ఎన్నో కష్టాలు పడ్డారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారు సినిమాలు లేక మానసిక వేదనకు గురయ్యారు. అలా అందరిలో తాను లాక్డౌన్ తో తీవ్రంగా మనోవేదన చెందానని ప్రముఖ నటి శ్రద్దాదాస్ అంటోంది. అయితే మరోసారి లాక్డౌన్ పెడితే చాలా కష్టమంటోందీ అమ్మడు.
తాజాగా శ్రద్ధ శ్రద్ధగా తన అందాలను సముద్రపు అంచున ఆరబోసింది. బీచ్ లో నడుస్తూ హాట్ హాట్ ఫొటోలను పెడుతూ ఒయ్యారాలు ఒలికింది. నిన్ను చూస్తే లాక్ డౌన్ కూడా హాయిగా గడిచిపోతుందని చాలా మంది నెటిజన్లు శ్రద్ధాను ఆటపట్టించారు. ‘సిద్ధుఫ్రం సికాకుళం’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధాదాస్ ఆ తరువాత ఆర్య-2తో పాపులారిటీ సాధించింది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించినా స్టార్ హీరోయిన్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోతోంది. అయితే అప్పడప్పుడు సోషల్ మీడియాలో అలరిస్తూ అభిమానులతో పాటు సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ భామ వెరీ గ్లామరస్ ఫొటోలను షేర్ చేసింది.
తాజాగా కవ్వించేలా తన అందాలు చూపిస్తూ బీచ్ ఒడ్డున.. ఓ స్విమ్మంగ్ ఫూల్ పక్కన నిలబడి ఫొటోలు దిగి షేర్ చేసింది. ఆమె ఫొటోలకు తెగ లైక్లు వచ్చేస్తున్నాయి. చాలా రోజులుగా వెండితెరపై కనిపించని శ్రద్ధాదాస్ ఇలా చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
