Unstoppable with NBK S2 – Prabhas: అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘అన్ స్థాపబుల్ విత్ NBK ‘ ప్రభాస్ ఎపిసోడ్ కి సంబంధించిన ఫుల్ ప్రోమో ఈరోజు సాయంత్రం విడుదల అయ్యింది.. ఈ ప్రోమో లో ప్రభాస్ ఎంతో ఫన్నీ గా బాలయ్య బాబుతో చేసిన చిట్ చాట్ చూడడానికి చాలా సరదాగా అనిపించింది.. ప్రభాస్ లో ఇంత ఫన్ యాంగిల్ కూడా ఉందా అని అందరికి అనిపించింది ఈ ప్రోమో చూసినప్పుడు…

అంత పెద్ద పాన్ ఇండియన్ సూపర్ స్టార్ స్థానంలో ఉండి కూడా ఇంత ఫ్రెండ్లీగా ఎలా ఉండగలరు అని ఇతర హీరోల అభిమానులు కూడా పొగుడుతున్నారు.. ఈ ప్రోమో లో ప్రభాస్ తో పాటుగా గోపీచంద్ కూడా హాజరయ్యాడు.. ప్రభాస్ కి సంబంధించిన సీక్రెట్స్ మొత్తం లీక్ చెయ్యడానికి ప్రయత్నం చెయ్యగా, ప్రభాస్ అతనిని అడ్డుకోవడం కనిపించింది. దీనికి సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది..ఈ ఎపిసోడ్ ఈ నెల 30వ తారీఖున టెలికాస్ట్ కాబోతుంది.
అయితే ఈ ఎపిసోడ్ మధ్యలో ప్రభాస్ తన బెస్ట్ ఫ్రెండ్ అయినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఫోన్ చేస్తాడు.. ప్రభాస్ పెళ్ళికి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని సీక్రెట్ చెప్పగా అప్పుడు ప్రభాస్ ‘ఒరేయ్ చరణ్.. నువ్వు నాకు ఫ్రెండ్ వా లేదా శత్రువు వా’ అంటూ అరుస్తాడు.. రామ్ చరణ్ మరియు ప్రభాస్ మధ్య స్నేహం ఉంది అనే విషయం అందరికి తెలుసు కానీ, ఒకరినొకరు ‘ఎరా..పోరా’ అనే రేంజ్ లో స్నేహం ఉందని మాత్రం ఈ షో ద్వారానే తెలిసింది.
అలా ఎన్నో హైలైట్స్ తో ఈ ఎపిసోడ్ చాలా ఫన్ తో కొనసాగినట్టు ఈ ప్రోమో చూస్తే అర్థం అయ్యిపోయింది.. అంతేకాకుండా ఈ ప్రోమో కి సోషల్ మీడియా లో రికార్డుస్థాయి వ్యూస్ వస్తున్నాయి.. ప్రోమో విడుదలైన నిమిషాల వ్యవధిలోనే లక్షల కొద్దీ లైక్స్ మరియు వ్యూస్ వచ్చాయి.. కొంతమంది హీరోలకు టీజర్ మరియు ట్రైలర్ కి కూడా ఈ రేంజ్ రాదని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో చెప్తున్నారు.
https://www.youtube.com/watch?v=wmCOHX1D1gA