Ravi Teja- waltair veerayya: మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే..చాలా కాలం తర్వాత మెగాస్టార్ ఊరమాస్ జానర్ లో చేస్తున్న సినిమా కాబట్టి ఈ చిత్రం పై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి..దానికి తోడు ఇంత ఊర మాస్ సబ్జెక్టు లో ఊర మాస్ హీరో రవితేజ కూడా తోడు అవ్వడం తో మాస్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ లాగ ఉండబోతుంది ఈ చిత్రం.

ఇక ఈరోజు విడుదలైన రవితేజ టీజర్ సోషల్ మీడియా ని షేక్ చేసేసింది..ఊర మాస్ తెలంగాణా స్లాంగ్ తో రవితేజ చెప్పిన డైలాగ్, ఫైట్ షాట్స్ లో ఆయన చూపించిన మాస్ స్వాగ్ చూస్తుంటే రవితేజ కి కెరీర్ బెస్ట్ రోల్స్ లో ఒకటిగా ఈ పాత్ర నిలిచిపోతుంది అని అర్థం అయిపోతుంది..ఇక చిరు తో రవితేజ కాంబినేషన్ సీన్స్ కి థియేటర్స్ పరిస్థితి తలచుకుంటేనే రోమాలు నిక్కపొడుస్తున్నాయి.
ఈ సినిమాలో రవితేజ ACP విక్రమ్ సాగర్ గా నటిస్తున్నాడు..వైజాగ్ పరిసర ప్రాంతాలలో స్మగ్లింగ్ చేస్తున్న మాఫియా ముఠా ని..వాళ్ళు చేస్తున్న అరాచకాలను అరికట్టడానికి ఆ ప్రాంతం లోకి అడుగుపెడతాడు రవితేజ..అది టీజర్ లో క్లియర్ గా గమనించొచ్చు..ఆయన క్యారక్టర్ కిక్ మరియు విక్రమార్కుడు సినిమాలను ఆధారంగా తీసుకొని డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది..ఫైట్ షాట్స్ లో ఆయన చూపించిన స్వాగ్ అదే సమయం లో అతని నోటి నుండి వచ్చిన పవర్ ఫుల్ డైలాగ్స్ విక్రమార్కుడు క్యారక్టర్ ని పోలిఉంది .

ఇక కెరీర్ లో రవితేజ తొలిసారి తెలంగాణ స్లాంగ్ ఈ సినిమాలో వాడాడు..చాలా బాగా అనిపించింది..రవితేజ స్లాంగ్ పూర్తిగా తెలంగాణ కి సంబంధించిన విధంగా ఉండగా..చిరంజీవి స్లాంగ్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినదిగా ఉంటుంది..వీళ్లిద్దరి మధ్య పోరాట సన్నివేశాలు కూడా ఉంటాయట..ఇంటర్వెల్ సన్నివేశం లో ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకోవడం వంటివి మాస్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ రప్పించే విధంగా ఉండనుంది..ఇలా ఎన్నో ప్రత్యేకలతో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి విన్నర్ గా నిలవడం ఖాయం అని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు.