Ajith Kumar House Tragedy: సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతతి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న స్టార్ హీరో అజిత్. హిట్టు/ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఈయనకి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కోలీవుడ్ ఒక్క రజినీకాంత్ కి తప్ప ఎవరికీ లేదు. ఈయనకి సంబంధించిన ఏ చిన్న విషయాన్నీ అయినా అభిమానులు సంబరాలు చేసుకుంటారు. అలాగే ఆయనకీ సంబంధించి ఏ చిన్న చేదు వార్త వచ్చినా తట్టుకోలేరు. నేడు అలాంటి సందర్భమే చోటు చేసుకుంది. అజిత్ కన్న తండ్రి పీ.సుబ్రహ్మణ్యం గత కొంతకాలం నుండి తీవ్రమైన అనారోగ్యం తో బాధపడుతున్నాడు.
అయితే నేడు పరిస్థితి మరీ విషమించడం తో ఆయన తన తుది శ్వాస ని విడిచాడు.సుబ్రహ్మణ్యం గారికి 84 సంవత్సరాలు ఉంటాయి,ఈయనకి ఎలాంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేదు. కేవలం ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. అజిత్ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీ లోకి వచ్చి నిలదొక్కుకున్నాడు. అయితే దైవం లాగ భావించే తండ్రి చనిపోవడం తో అజిత్ మాణికంగా తీవ్రమైన దిగ్బ్రాంతికి గురయ్యాడు.
ఇక కోలీవుడ్ ప్రముఖులందరూ అజిత్ ఇంటికి చేరుకొని సుబ్రహ్మణ్యం గారికి నివాళి అర్పిస్తున్నారు. రీసెంట్ గానే తన భార్య పిల్లలతో హాలిడే ట్రిప్ కి వెళ్లొచ్చిన అజిత్ కి వెంటనే ఇలాంటి దురదృష్టకరమైన వార్త వినడం అభిమానులను ఎంతో బాధకి గురి చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా అజిత్ కి అభిమానులు ధైర్యం చెప్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.