https://oktelugu.com/

Rana Naidu 2 : ‘రానా నాయుడు’ రెండో సీజన్ విడుదల తేదీ ఖరారు.. ఈసారి ఇంకా ఘాటైన బూతులతో నిండిపోనుందా?

Rana Naidu : డిజిటల్ మీడియాలో రీసెంట్ గా సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’.విక్టరీ వెంకటేష్ మరియు రానా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కి తొలుత నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత కుర్రాళ్ళు ఈ సిరీస్ ని బాగా ప్రోత్సహించారు.ఫలితంగా గత నెల రోజుల నుండి ఈ వెబ్ సిరీస్ నాన్ టాప్ గా టాప్ 3 లో ట్రెండ్ అవుతూనే ఉంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ నుండి విడుదలైన […]

Written By: , Updated On : April 19, 2023 / 08:28 PM IST
Follow us on

Rana Naidu : డిజిటల్ మీడియాలో రీసెంట్ గా సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’.విక్టరీ వెంకటేష్ మరియు రానా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కి తొలుత నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత కుర్రాళ్ళు ఈ సిరీస్ ని బాగా ప్రోత్సహించారు.ఫలితంగా గత నెల రోజుల నుండి ఈ వెబ్ సిరీస్ నాన్ టాప్ గా టాప్ 3 లో ట్రెండ్ అవుతూనే ఉంది.

నెట్ ఫ్లిక్స్ సంస్థ నుండి విడుదలైన వెబ్ సిరీస్ లలో మరొక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకుంది ‘రానా నాయుడు’.సుమారుగా పది ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ సీజన్ 1 తోనే పూర్తి అయిపోయిందని అందరూ అనుకున్నారు.కానీ అక్కడితో ఆగిపోలేదు, సీజన్ 2 కూడా అతి త్వరలోనే ప్రారంభం కాబోతుందని ఈరోజు ఉదయం నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

సీజన్ ప్రారంభం నుండి భద్ర శత్రువులుగా ఉంటూ వచ్చిన రానా నాయుడు మరియు నాగా నాయుడు క్లైమాక్స్ లో ఇద్దరు ఒకరి ప్రాణాలను ఒకరు కాపాడుకొని శత్రువులను చంపేస్తారు.తన ప్రాణాలను కాపాడినందుకు గాను నాగ నాయుడు కి రానా నాయుడు పాతిక లక్షల రూపాయిలు ఇచ్చి ఎక్కడైనా ప్రశాంతం గా బ్రతుకు అంటాడు, రానా నాయుడు కూడా తన ఉద్యోగం ని మానేసి పెళ్ళాం పిల్లలతో ఛిల్ల్ అవ్వడం తో మొదటి సీజన్ ముగుస్తుంది.

ఇక రెండవ సీజన్ మళ్ళీ నాగా నాయుడు తిరిగి వస్తాడా..?, మళ్ళీ తండ్రి కొడుకుల మధ్య యుద్ధం జరగబోతుందా వంటివి సీజన్ 2 చూసి తెలుసుకోవాలి.ఈ రెండవ సీజన్ ఆగష్టు నెలలో ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.ఇప్పటికీ ఈ సీజన్ కి సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తి కూడా చేసేసారట.త్వరలోనే విడుదల తేదీన అధికారికంగా ప్రకటించబోతున్నారు.