Site icon OkTelugu

Passenger Landed Plane: పైలెట్ పరిస్థితి విషమం.. విమానాన్ని సురక్షితంగా ఇలా దించిన ప్రయాణికుడు

Passenger Landed Plane: కొన్ని సార్లు వింతలు జరుుగుతుంటాయి. మనకు సంబంధం లేని విషయాల్లో కూడా మనం తలదూర్చుతాం. కాదు అలా చేయాల్సి వస్తుంది. అదేదో మంచి జరిగితే ఓకే కానీ చెడు జరిగితే మాత్రం మనకు తిట్లే. మనకు తెలియకపోతే బండి నడపడమే రాదు. కానీ అతడు ఏకంగా ఓ విమానాన్ని నడిపాడు. తనకు సరిలేరెవ్వరు అని నిరూపించాడు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడి తనకు ఎవరు సాటి రారని చాటిచెప్పాడు.

Passenger Landed Plane

అమెరికాలోని ఫ్లోరిడాలో 14 ప్రయాణికులతో ఓ చార్టర్ ఫ్లైట్ వెళ్తోంది. అందులో పైలెట్ అనారోగ్యానికి గురై అకస్మాత్తుగా స్ర్పహ తప్పి కుప్పకూలిపోయాడు. దీంతో అందరు భయాందోళనకు గురయ్యారు. ఇక తమ ప్రాణాలు గాల్లో కలుస్తాయని ఆందోళణ చెందారు. కానీ ఇంతలో ఓ ప్రయాణికుడు క్యాబిన్ లోకి వెళ్లి కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చాడు.

Also Read: Tamannaah Bhatia: వయసు పెరిగినా.. వేడి వేడి అందాలు వడ్డిస్తున్న తమన్నా

దీంతో వారు చెప్పిన సూచనల ప్రకారం సదరు ప్రయాణికుడు విమానాన్ని ఆపరేట్ చేశాడు. సేఫ్ గా విమానాన్ని ల్యాండ్ చేశాడు. దీనికి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తమ ప్రాణాలు దక్కించినందుకు అతడికి రుణపడి ఉంటామని చెప్పారు. ఆపద సమయంలో ధైర్యంగా విమానాన్ని నడిపి అందరి ప్రాణాలు కాపాడిన అతడిని వేనోళ్ల పొగిడారు. తమకు పునర్జన్మ ప్రసాదించావని ఆనందం వ్యక్తం చేశారు.

Passenger Landed Plane

ఒక్కోసారి మనకు తెలియకున్నా కొన్ని విషయాలు అప్పుడప్పుడు మనకు మేలు చేస్తాయి. ఏదో చేయబోతే ఏదో జరిగినట్లు అంతా మన మంచికే అని సర్ది చెప్పుకుంటుంటారు. ఆపద సమయాల్లో బుద్ధిబలం ఉపయోగించి సాయం చేసిన వారికి ఎన్నో ప్రశంసలు వస్తుంటాయి. ఇదే కోవలో ఈ ప్రయాణికుడిని కూడా అందరు పొగడ్తలతో ముంచెత్తారు.

Also Read:Bride Died: పెళ్లిపీటలపైనే తనువు చాలించిన వధువు.. మృతికి షాకింగ్ కారణం!

Exit mobile version