Super Star Krishna- Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ నటులు, అభిమానులను తీవ్ర దు:ఖంలో ముంచింది. ఆయన లేడనే విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో ఉన్న అనుబంధాలను స్నేహితులు, సినీ నటులు గుర్తు చేసుకుంటున్నారు. ఇక అభిమానులు కృష్ణకు సంబంధించిన పలు వీడియోలు పోస్టు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా కృష్ణ, మహేశ్ లకు సంబంధించిన ఓ వీడియో యూట్యూబ్ లో పోస్టు చేశారు. ఈ వీడియోలో కృష్ణ, మహేశ్ బాబులు నటించిన సినిమాల్లోని సేమ్ గెటప్ లను పక్కపక్కనే పెట్టారు. దీంతో ఒకే గెటప్ లో సూపర్ స్టార్స్ ను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
సినీ ఇండస్ట్రీలో మహారాజుగా వెలుగొందిన సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 14న ఉదయం మరణించారు. ముందుగా అస్వస్థకు గురైన ఆయనను కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఈ షాకింగ్ న్యూస్ తెలియగానే చాలా మంది తట్టుకోలేకపోయారు. మోహన్ బాబు లాంటి తోటి నటుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా సంవత్సరంలోపే తల్లిదండ్రులను కోల్పోయిన మహేశ్ బాబును పలువరు ప్రముఖులు పరామర్శించారు.
అప్పటి నుంచి కృష్ణ గురించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బుర్రిపాలెంలో జన్మించిన కృష్ణ.. హైదరాబాద్ లో అత్యున్నతస్థాయికి ఎదిగారు. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు పడ్డారు.. అనేక సినిమాలు చేశారు. రైతు నుంచి కౌబాయ్ వరకు అనేక పాత్రల్లో నటించారు. ఆయన జీవితంలో అల్లూరి సీతారామరాజు గెటప్ ఎవర్ గ్రీన్. ఈ గెటప్ లో మరో నటుడిని ఊహించుకోలేం అన్నంతగా జీవించారు. అయితే ఆయన చేసిన పాత్రల్లో కొన్ని మహేశ్ బాబు కూడా చేశారు. అలా సింక్ అయిన కొన్ని పాత్రలతో కలిపి చేసిన వీడియో వైరల్ అవుతోంది.
ఉదాహరణకు కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాలోని కౌబాయ్ గెటప్ తో మహేశ్ బాబు ‘టక్కరి దొంగ’ గెటప్ ను కలిపారు. దీంతో కృష్ణ, మహేశ్ లు ఇద్దరూ ఒకే గెటప్ లో కనిపిస్తారు. ఇక కారు డోర్ తీసే సీన్స్, కృష్ణుడి గెటప్స్.. ఇలా రకరకాలు గెటప్ లను చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. 24 గంటలకు గడవకముందే ఈ వీడియోకు లక్షల వ్యూస్ వచ్చి రచ్చ చేస్తోంది. కృష్ణపై ఉన్న అభిమానంతో చాలా మంది ఎన్నో వీడియోలుు చేశారు. కానీ ఇలా తండ్రీ కొడుకులు ఒకే గెటప్ లో కనిపించే వీడియో మాత్రం ఆకట్టుకుంటోంది. ఆ వీడియో కింద ఉంది చూసి ఎంజాయ్ చేయండి..