Bigg Boss Telugu 6: బిగ్ బాస్ లో షాకింగ్ ఎలిమినేషన్.. ఈ వారం ఆ కంటెస్టెంట్ అవుట్!

Bigg Boss Telugu 6: బిగ్ బాస్ సీజన్ 6 చప్పగా మొదలైన ఈ సో క్రమంగా ఊపందుకుంటోంది. అయినా ప్రతీవారం ఫైర్ బ్రాండ్లు.. హౌస్ లో బాగా సందడి చేసేవారు ఎలిమినేట్ అవుతుండడంతో ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. గత రెండు వారాల్లో హౌస్ లోనే అత్యంత యాక్టివ్ గా ఉండే ఆరోహీ, చలాకీ చంటిలో ఎలిమినేట్ కావడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ వారం కూడా అలాగే ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నట్టు తెలిసింది. శనివారం […]

Written By: NARESH, Updated On : October 15, 2022 10:58 pm
Follow us on

Bigg Boss Telugu 6: బిగ్ బాస్ సీజన్ 6 చప్పగా మొదలైన ఈ సో క్రమంగా ఊపందుకుంటోంది. అయినా ప్రతీవారం ఫైర్ బ్రాండ్లు.. హౌస్ లో బాగా సందడి చేసేవారు ఎలిమినేట్ అవుతుండడంతో ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. గత రెండు వారాల్లో హౌస్ లోనే అత్యంత యాక్టివ్ గా ఉండే ఆరోహీ, చలాకీ చంటిలో ఎలిమినేట్ కావడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ వారం కూడా అలాగే ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నట్టు తెలిసింది.

శనివారం నాగార్జున వచ్చి కంటెస్టెంట్ల లూప్ హోల్స్ తెలిపి వారు గుడ్ నా? బ్యాడ్ నా? ఆవరేజ్ నో ఇంటి సభ్యులకు తెలిపారు. వారి ఆటతీరు, హౌస్ లో ప్రవర్తన ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. ఈ వారం నామినేషన్ లో ఉన్న కీర్తి, ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, సుదీప, శ్రీహాన్, రాజ్, శ్రీసత్య, మెరీనాలలో ఒకరిని సేవ్ చేశారు. ఈ వారం శ్రీసత్యను సేవ్ చేశాడు. మిగతా వారిని ఆదివారం చేస్తానని క్లోజ్ చేశారు.

ఇక బిగ్ బాస్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ వారం శ్రీహాన్, ఆదిరెడ్డి, గీతూ, శ్రీసత్యలకు భారీగా ఓటింగ్ పడింది. వీరు నలుగురు ఓటింగ్ లో దుమ్ముదులిపినట్టు తెలిసింది. ఇక రాజ్ , కీర్తిలకు కూడా బాగానే ఓట్లు పడినట్టు సమాచారం. మిగిలిన సుదీప, మెరీనా, బాలాదిత్యలు డేంజర్ జోన్ ఉన్నట్టు తెలిసింది. ఈ ముగ్గురిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

అయితే ఈ వారం హౌస్ మేట్స్ కోసం సిగరెట్ త్యాగం చేసిన బాలాదిత్యకు సెంటిమెంట్ కలిసివచ్చి భారీగా ఓట్లు పడ్డట్టు తెలిసింది. చివరగా సుదీప, మెరీనా మిగలగా.. ఈ ఇద్దరిలో అతి తక్కువ ఓట్లు వచ్చిన సుదీప ఈ వారం ఎలిమినేట్ అయిపోయినట్టు సమాచారం. మరి నిజంగానే ఈ సుదీప వెళ్లిపోయిందా? లేదా? అన్నది ఈ ఆదివారం రాత్రికి అధికారికంగా తేలనుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సుదీప ఎలిమినేట్ అయినట్టు చెబుతున్నారు.