https://oktelugu.com/

Bigg Boss 6 Telugu : శ్రీహాన్ – రేవంత్ మారిపోయారు అంటూ నాగార్జున ముందు కంటతడి పెట్టిన శ్రీ సత్య

Bigg Boss 6 Telugu Sri satya : ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది..ప్రతి వీకెండ్ లో కంటెస్టెంట్స్ కి ఎదో ఒక ఫిట్టింగ్ పెట్టి వెళ్లే నాగార్జున ఈ వీకెండ్ అలాంటి ప్లాన్ తోనే వచ్చాడు..హౌస్ లో మీరు చేసిన తప్పులు ఏమిటి..ఎవరి పట్ల అసభ్యంగా ప్రవర్తించారో చెప్పమని నాగార్జున అంటాడు..అప్పుడు ఫైమా ‘నేను వెటకారం తగ్గించుకోవాల్సింది సార్’ అని అంటుంది..ఇక ఆ తర్వాత రేవంత్ ‘గీతూ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 3, 2022 / 08:18 PM IST
    Follow us on

    Bigg Boss 6 Telugu Sri satya : ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది..ప్రతి వీకెండ్ లో కంటెస్టెంట్స్ కి ఎదో ఒక ఫిట్టింగ్ పెట్టి వెళ్లే నాగార్జున ఈ వీకెండ్ అలాంటి ప్లాన్ తోనే వచ్చాడు..హౌస్ లో మీరు చేసిన తప్పులు ఏమిటి..ఎవరి పట్ల అసభ్యంగా ప్రవర్తించారో చెప్పమని నాగార్జున అంటాడు..అప్పుడు ఫైమా ‘నేను వెటకారం తగ్గించుకోవాల్సింది సార్’ అని అంటుంది..ఇక ఆ తర్వాత రేవంత్ ‘గీతూ పట్ల ఆరోజు నేను అలా ప్రవర్తించినందుకు సిగ్గు పడుతున్నా సార్ ‘ అని చెప్తాడు.

    ఇక ఆ తర్వాత శ్రీ సత్య ‘ఆరోజు కీర్తి నేను అలా వెక్కిరించకుండా ఉండాల్సింది సార్’ అని చెప్తుంది..ఈ పర్వం ముగిసిన తర్వాత ఇన్ని రోజులు హౌస్ లో ఉన్నారు కదా మీ దృష్టిలో బెస్ట్ కెప్టెన్ ఎవరు ..వరస్ట్ కెప్టెన్ ఎవరు అని నాగార్జున రెండు చైర్స్ వేసి వాటిల్లో కుర్చోపెట్టామని అడుగుతాడు..అప్పుడు ఆది రెడ్డి ఇప్పటి వరుకు అంత బాగుంది ఏంటా అనుకున్న పెట్టారు కదా ఫిట్టింగు అని నాగార్జున ని అంటాడు.

    ఇక ఆ తర్వాత శ్రీ సత్య ‘రేవంత్ శ్రీ హాన్ ఇద్దరు మారిపోయారు సార్’ అని అంటుంది..మరి నువ్వు చెప్పాలి కదా హార్ట్ అయ్యాను అని అడుగుతాడు నాగార్జున..నేను హర్ట్ అయ్యినట్టు శ్రీహాన్ కి తెలుసు సార్ అంటుంది శ్రీ సత్య..అప్పుడు శ్రీహాన్ ‘నాకు తెలీదు సార్’ అని అంటాడు..అలా వీళ్లిద్దరి మధ్య కాసేపు వాడివేడి చర్చలు నడుస్తాయి..తర్వాత ఏమి జరిగిందో ఎపిసోడ్ చూసి తెలుసుకోవాల్సిందే..ఇక వారం టికెట్ 2 ఫినాలే టాస్కు లో కంటెస్టెంట్స్ ఆడిన ఆట తీరుపై నాగార్జున ఎలా స్పందిస్తాడో..ఎవరికీ కోటింగ్ ఇవ్వబోతున్నాడో చూడాలి.

    ఇది ఇలా ఉండగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగింది..అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండదని..సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే ఉంటుందని..ఫైమా ఎలిమినేట్ అయ్యిందని తెలుస్తుంది..మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ చూడాలి.