https://oktelugu.com/

Srireddy Chiranjeevi: మీ బోడి పెద్దరికం ఎవరడిగారు? చిరంజీవిపై రెచ్చిపోయిన శ్రీరెడ్డి

Srireddy Chiranjeevi: స్వయం కృషితో ఎదిగి.. ఇండస్ట్రీలో ఎవరు ఆపదలో ఉన్నా ఆదుకునే వారిలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్యులు. మొన్నటి కరోనా లాక్ డౌన్ వేళ ఆయన చేసిన సేవానిరతి అంతా ఇంతాకాదు.. ఎంతో మందిని ఆదుకొని అందరి చేత ప్రశంసలు కురిపించారు. బ్లడ్ బ్యాంకు నుంచి ఆక్సిజన్ బ్యాంకుల వరకూ తెలుగు రాష్ట్రాల్లో పెట్టి స్ఫూర్తిదాతగా నిలిచారు. అలాంటి చిరంజీవి ఇటీవల సినీ కార్మికుల సభలో తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండాలనుకోవడం లేదని.. సినీ కార్మికులు, […]

Written By:
  • NARESH
  • , Updated On : January 4, 2022 / 03:29 PM IST
    Follow us on

    Srireddy Chiranjeevi: స్వయం కృషితో ఎదిగి.. ఇండస్ట్రీలో ఎవరు ఆపదలో ఉన్నా ఆదుకునే వారిలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్యులు. మొన్నటి కరోనా లాక్ డౌన్ వేళ ఆయన చేసిన సేవానిరతి అంతా ఇంతాకాదు.. ఎంతో మందిని ఆదుకొని అందరి చేత ప్రశంసలు కురిపించారు. బ్లడ్ బ్యాంకు నుంచి ఆక్సిజన్ బ్యాంకుల వరకూ తెలుగు రాష్ట్రాల్లో పెట్టి స్ఫూర్తిదాతగా నిలిచారు.

    Srireddy Chiranjeevi

    అలాంటి చిరంజీవి ఇటీవల సినీ కార్మికుల సభలో తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండాలనుకోవడం లేదని.. సినీ కార్మికులు, కళాకారులకు ఆపద వస్తే ఆదుకుంటానని వినమ్రంగా చెప్పుకొచ్చాడు. అయితే అంత నిస్వార్థంగా పనిచేస్తున్న చిరంజీవిని పట్టుకొని హాట్ ఐటెం బాంబు శ్రీరెడ్డి రెచ్చిపోయింది. నోటికి ఎంత వస్తే అంత మాటలు అనేసింది. అసలు సిగ్గు ఎగ్గూ లేకుండా పెద్దాయనపై నోరుపారేసుకుంది.

    Also Read: సాంగ్ అదిరింది.. రెజీనా, మెగాస్టార్ పోటీ పడి స్టెప్పులేశారు !

    సినీ పరిశ్రమలోని పెద్దరికం గురించి అసలు ఈవిడను ఎవరు అడిగారో తెలియదు కానీ ఓ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి ఏకంగా మెగాస్టార్ చిరంజీవిపై విరుచుకుపడి నానా బూతులు కక్కేసింది.

    ‘మీ పెద్దరికం ఎవడు అడిగాడు? బోడి పెద్దరికం నాకు అర్థం కాదు.. మీకు మీరు పెద్దరికం తీసుకున్నట్లున్నారు. అసలు ఎక్కడికైనా వెళ్లాలంటే చాపర్ ఫ్లైట్స్ వేసుకొని వీళ్లు బయలు దేరుతారు. ప్రొడ్యూసర్ కి వచ్చిన సమస్యలు, డిస్ట్రిబ్యూటర్స్ కు వచ్చిన సమస్యలు కావచ్చు.. థియేటర్ సమస్యలున్నాయి.. ఈ హీరోలకు ఏం తెలుసు.. ఊపుకుంటూ పోతారు.. చిన్న సినిమాలను బతికించాడని దాసరి అన్నారు. ఏపీ ప్రభుత్వంపై ఎవరైతే చీప్ గా మాట్లాడుతున్నారో వారు పెద్ద మనుషులు కారు.. ’ అంటూ శ్రీరెడ్డి నోరుపారేసుకుంది.

    ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో సమస్యలు పరిష్కరించుకోండి.. హీరోలు నిర్మాతల తరుఫున మాట్లాడుతారంటే ప్రసన్నకుమార్ దగ్గర మాట్లాడండి అంటూ శ్రీరెడ్డి సూచించింది. హీరోలు ఊపుకుంటే సమస్యలు పరిష్కరిస్తామని వెళ్లిపోకండి.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో సంప్రదిస్తే వాళ్లు మాట్లాడుతారు.. అంటూ శ్రీరెడ్డి ఉచిత సలహా ఇచ్చింది.

    పెద్దరికం చేయాలంటే టాలీవుడ్ లో మోహన్ బాబు గారు.. బాలకృష్ణ గారు సూట్ అవుతారని.. మిగతా ఎవరికి సూట్ కాదని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. చిరంజీవి పెద్దరికాన్ని ఎద్దేవా చేస్తూ శ్రీరెడ్డి హాట్ కామెంట్స్ చేసింది. అవిప్పుడు వైరల్ అవుతున్నాయి.

    Also Read: ఆర్ఆర్ఆర్ ఖాతాలో చెత్త రికార్డు.. ఆందోళనలో మూవీ యూనిట్..