Homeఎంటర్టైన్మెంట్Hyper Adi -Varshini : నీ కామం తగలెయ్యా.. హైపర్‌ అదీ ఏంటయ్యా ఇదీ..

Hyper Adi -Varshini : నీ కామం తగలెయ్యా.. హైపర్‌ అదీ ఏంటయ్యా ఇదీ..

Sixth Sense Season 5 – Hyper Adi : హైపర్‌ అదీ.. బుల్లి తెరకు పరిచయం అవసరం లేని పేరు. తన స్పాంటేనిటీ, పంచ్‌లతో ఎలాంటి షోనైనా రక్తి కట్టించగలడు. జబర్దస్త్‌లో ఉన్నప్పుడు అతడు వేసిన స్కిట్లు కొన్ని వివాదస్పదమయ్యాయి కూడా.. మల్లెమాల ఎంకరేజ్‌ చేసింది కాబట్టి ఆది మరింత రెచ్చిపోయేవాడు. ఎక్కడ చెడిందో తెలియదు కానీ జబర్దస్త్‌ నుంచి బయటకు వచ్చేశాడు. తర్వాత మళ్లీ వెళ్లాడు. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రమే కన్పిస్తున్నాడు.

సినిమా అవకాశాలు వస్తున్న నేపథ్యంలో బిజీగా మారిపోయాడు. ఇటీవల రవితేజ సినిమా ధమాకాలో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ లో నటించాడు. రావు రమేష్‌ కు కౌంటర్లు ఇస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. తన సీన్లు మొత్తం ఆది రాసుకున్నాడని టాక్‌. సినిమాల్లో నటిస్తున్నంత మాత్రాన ఆది బుల్లితెరను వదిలిపెట్టడం లేదు. స్టార్‌ మా నిర్మించే షోలల్లో కన్పిస్తున్నాడు. తన స్పాంటేనిటీతో ప్రేక్షకులను నవ్విస్తున్నాడు.

తాజాగా స్టార్‌ మా లో ఓంకార్‌ సిక్స్త్‌ సెన్స్‌ షో ఆరో సీజన్‌ ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధించి ప్రోమో కూడా విడుదలయింది. ఈ షోలో పలువురు పాపులర్‌ బుల్లితెర నటులు, సినీనటుడు వరుణ్‌ సందేశ్‌, వితికా శేరు పాల్గొన్నారు. ఎప్పటిలాగే ఒంకార్‌ ‘వన్‌ సెకన్‌’ అంటూ వచ్చిన వారిని భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ షో మైండ్‌ గేమ్‌ కాబట్టి తనదైన స్పాంటేనిటీతో ఓంకార్‌ పార్టిసిపెంట్ల ను ఒక ఆట ఆడుకున్నాడు.

ఇక హైపర్‌ షో లో ఉన్న చీర్‌ గర్ల్స్‌తో సందడి చేశాడు. ‘నువ్వొస్తవని నేను సిల్క్‌ చీర కట్టుకుంటుని’ అనే పాట పాడించి ప్రేక్షకులను నవ్వించాడు. ఈషోకు తనతో పాటు వర్షిణి సౌందరరాజన్‌ను తీసుకొచ్చిన ఆది.. ఆమెను ఎత్తుకున్నాడు. వర్షిణి షార్ట్‌ వేసుకొచ్చి థండర్‌ థై షో చేసింది. ఆమె అందాన్ని చూసి ఆగలేకపోయాడో ఏమో కానీ అమాంతం ఎత్తుకున్నాడు.దీనికి వర్షిణి కూడా ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. ఇక ఓంకార్‌ వచ్చి ‘నేను బరువు పెరిగానో లేదో చూడవా’ అంటే హైపర్‌ ఆది ‘మీరు బరువు పెరగలేదు అలానే ఉన్నారంటూ’ తప్పించుకున్నాడు.

గతంలో ఆది, వర్షిణి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌ థింగ్‌ నడుస్తోందని బుల్లితెర వర్గాల్లో టాక్‌ ఉండేది. ఆ మధ్య హైపర్‌ ఆది పుట్టిన రోజు నాడు వర్షిణి ప్రత్యేకంగా విషేస్‌ చెప్పింది. అతడితో అర్థరాత్రి కేక్‌ కట్‌ చేయించింది. ‘హైపర్‌ ఆది నువ్వు నాకు తగిన జోడివి అంటూ’ కామెంట్‌ కూడా చేసింది. దానికి బలం చేకూర్చుతూ ఆది వర్షిణిని ఎత్తుకోవడం విశేషం. అయితే ఈ ప్రోమో చూసిన వారు ‘నీ కామం తగలెయ్యా.. హైపర్‌ అదీ ఏంటయ్యా ఇదీ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version