https://oktelugu.com/

Viral Tweet: సార్ నేను గర్భవతిని.. బాస్ కొంపముంచిన మెసేజ్

ఒక కార్పొరేట్ కంపెనీలో ఓ మహిళ ఉద్యోగం చేస్తోంది. తనకు ఉద్యోగం కావాలంటూ ఓ మహిళా ఉద్యోగి చేసిన మెసేజ్ ఆ బాస్ కొంపముంచింది. మహిళా ఉద్యోగి పంపించిన మెసేజ్ చదివిన భార్య కు ఎలా సర్ది చెప్పాలో తెలియక ఆ బాస్ తల పట్టుకున్నాడు. ఆ ఫన్నీ వాట్సప్ మెసేజ్ ల స్క్రీన్షాట్ చాలామందికి నవ్వు తెప్పిస్తోంది. ఈ ట్వీట్ ఏకంగా మూడు కోట్ల పైచిలుకు వ్యూస్ సాధించింది. "ఇంటర్నెట్ హాల్ ఆఫ్ ఫేమ్" అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆ ఫోటో పోస్ట్ అయింది.

Written By: Rocky, Updated On : July 26, 2023 6:31 pm
Viral Tweet

Viral Tweet

Follow us on

Viral Tweet: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది వైరల్ అవుతుందో అంతు పట్టకుండా ఉంది. ఒకప్పుడు ఒక వార్త అంటే దానివల్ల సమాజానికి ఎంత ఉపయోగం అనే కోణంలో మాత్రమే పాత్రికేయులు చూసేవారు. రాను రాను పాత్రికేయులకు కూడా మార్పులు చోటు చేసుకోవడంతో వింతగా ఉన్న విషయాలే వార్తలవుతున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన అటువంటి వార్తలే ట్రెండింగ్ టాపిక్స్ గా నిలిచిపోతున్నాయి అయితే ప్రస్తుతం అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే.

ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి కి అత్యవసరంగా సెలవు కావాల్సి వచ్చింది. దీంతో తన బాస్ కు మెసేజ్ చేసింది. అయితే ఆ మెసేజ్ బాస్(అతని)కొంప ముంచింది. ఆ ఉద్యోగిని చేసిన మెసేజ్ ను తన భార్య చదవడంతో ఆ బాస్ తల పట్టుకున్నాడు. వాట్సప్ చాట్ తాలూకూ స్క్రీన్ షాట్ చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది.

ఒక కార్పొరేట్ కంపెనీలో ఓ మహిళ ఉద్యోగం చేస్తోంది. తనకు ఉద్యోగం కావాలంటూ ఓ మహిళా ఉద్యోగి చేసిన మెసేజ్ ఆ బాస్ కొంపముంచింది. మహిళా ఉద్యోగి పంపించిన మెసేజ్ చదివిన భార్య కు ఎలా సర్ది చెప్పాలో తెలియక ఆ బాస్ తల పట్టుకున్నాడు. ఆ ఫన్నీ వాట్సప్ మెసేజ్ ల స్క్రీన్షాట్ చాలామందికి నవ్వు తెప్పిస్తోంది. ఈ ట్వీట్ ఏకంగా మూడు కోట్ల పైచిలుకు వ్యూస్ సాధించింది. “ఇంటర్నెట్ హాల్ ఆఫ్ ఫేమ్” అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆ ఫోటో పోస్ట్ అయింది.

ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేసే ఓ మహిళ లీవ్ కోసం తన బాస్ కు వాట్సాప్ ద్వారా అప్లై చేసింది. ముందుగా తన బాస్ కు “హాయ్” అని పంపింది. తర్వాత “నేను గర్భవతి” అని మెసేజ్ చేసింది. దీంతో ఆ బాస్ షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఆ ఉద్యోగి వరుసగా ” నాకు కొన్ని రోజులు సెలవు కావాలి. అర్బన్ గురించి నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడాలి. దయచేసి సెలవు మంజూరు చేయండి” అంటూ మెసేజ్ కు పంపింది. ఆ మెసేజెస్ కు బాస్ స్పందించారు. “మొదట ఈ విషయం గురించి నా భార్యతో మాట్లాడాలి. ఆమె కేవలం తొలి రెండు మెసేజ్ లు మాత్రమే చదివింది” అని మెసేజ్ చేసాడు. ఆ తర్వాత “ఈ మొత్తం విషయాన్ని అంతా ఒకే మెసేజ్లో పంపించవచ్చు కదా” అని అడిగాడు. వారిద్దరి మధ్య జరిగిన ఈ చార్ట్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఇప్పటివరకు దీనిని మూడు కోట్లకు పైగా వీక్షించారు. ఐదు లక్షల మంది లైక్ చేశారు. ఇక ఈ ట్వీట్ పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ” అయ్యో పాపం ఆ బాస్ కు ఎంత కష్టం వచ్చింది అంటూ” కామెంట్లు చేస్తున్నారు.