https://oktelugu.com/

Shekar Master – Hyper Adi : శేఖర్ మాస్టర్ “శ్రద్ధ”గా పులిహోర కలుపుతుంటే.. పాపం ఆదికి..

Shekar Master – Hyper Adi వెనుకటి రోజుల్లో.. నటినటులు కేవలం తమ హావ భావాల ద్వారా అభినయాన్ని పలికించేవారు. దీనివల్ల సినిమాలు రక్తి కట్టేవి. జనాలను అలరించేవి. కాలక్రమేణా సినిమాల్లో మార్పులు వచ్చాయి. టెక్నాలజీ పెరగడంతో టీవీ చానల్స్ గుమ్మం ముందుకే వచ్చాయి.. ఇందులో పోటీ పెరగడంతో విభిన్న తరహా కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇక తెలుగు నాట అయితే ఇలాంటి కార్యక్రమాలకు కొదవలేదు. ఢీ, బీబీ జోడీ, ఇలా చెప్పుకుంటూ పోవాలే గానీ జాబితా బొచ్చెడు. […]

Written By:
  • Rocky
  • , Updated On : March 22, 2023 / 08:11 PM IST
    Follow us on

    Shekar Master – Hyper Adi వెనుకటి రోజుల్లో.. నటినటులు కేవలం తమ హావ భావాల ద్వారా అభినయాన్ని పలికించేవారు. దీనివల్ల సినిమాలు రక్తి కట్టేవి. జనాలను అలరించేవి. కాలక్రమేణా సినిమాల్లో మార్పులు వచ్చాయి. టెక్నాలజీ పెరగడంతో టీవీ చానల్స్ గుమ్మం ముందుకే వచ్చాయి.. ఇందులో పోటీ పెరగడంతో విభిన్న తరహా కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇక తెలుగు నాట అయితే ఇలాంటి కార్యక్రమాలకు కొదవలేదు. ఢీ, బీబీ జోడీ, ఇలా చెప్పుకుంటూ పోవాలే గానీ జాబితా బొచ్చెడు.

    ఇక ఈటీవీ లో ప్రసారమవుతున్న ఢీ షో ఒకప్పుడు ప్రైమ్ టైంలో అదరగొట్టేది. ఒక రేంజ్ లో రేటింగ్స్ సాధించేది.. ఇప్పుడు నేల చూపులు చూస్తోంది.. ఇలాంటప్పుడు రేటింగ్స్ పెంచే బాధ్యత మల్లెమాల జడ్జిలకు అప్పగించినట్టుంది. దీంతో జడ్జిలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న సీజన్ లో శ్రద్ధదాస్, శేఖర్ మాస్టర్, పండు, ఇంకా కొంతమంది జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.. హైపర్ ఆది, ప్రదీప్ ఎలాగూ ఉండనే ఉన్నారు.. ఆ వెకిలి కామెడీ, జబర్దస్త్ ను మించిన బూతు స్కిట్లు అందులో కామన్ అయిపోయాయి. మరీ ఈమధ్య ఆ డోస్ పెరిగింది.. తాజాగా విడుదలైన ఒక ప్రోమోలో శ్రద్ధదాస్, శేఖర్ మాస్టర్ ఉప్పెన సినిమాలో జల జల జలాపాతం పాటకు డ్యాన్స్ వేశారు.. ఏ మాటకు ఆ మాట ఇద్దరూ కెమిస్ట్రీ సూపర్ గా పండించారు. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ తన కళ్ళతో శ్రద్ధ దాస్ ను ఉక్కిరి బిక్కిరి చేశాడు.. ఆమె తేరుకునే లోపే శ్రద్ధ ఒడిలో సేద తీరాడు.

    ఇక ఎప్పటినుంచో శ్రద్ధను గోకుతున్న( మల్లెమాల భాష ఇలానే ఉంటుంది) హైపర్ ఆది ఈ పాటలో శేఖర్ మాస్టర్ డాన్స్ వేసిన తీరును చూసి అలా సైలెంట్ అయిపోయాడు.. వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో అని ఆత్రుతగా చూశాడు. శ్రద్ధ దాస్ ను శేఖర్ మాస్టర్ పదే పదే తాకుతుండడంతో… ఇక నాకు మిగిలింది కండువానే అని ముఖం పెట్టాడు.. ఈ ప్రోమో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో.. నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ” శేఖర్ మాస్టర్ శ్రద్ధగా పులిహోర కలుపుతుంటే.. హైపర్ ఆదికి ఎంత కష్టం వచ్చిందని” కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.