TV5 Samba Shivarao : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. టీవీ 5 లో సాంబశివరావు కొలువు పోయింది.. ఇంతకీ ఏం జరిగింది?

ఏపీలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని బలంగా కోరుకున్న పాత్రికేయులలో టీవీ 5 సాంబశివరావు ఒకరు. కూటమి అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర పోషించారు. టీవీ డిబేట్ లలో నేరుగా జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు..

Written By: NARESH, Updated On : September 29, 2024 8:32 pm

TV5 Samba Shivarao

Follow us on

TV5 Samba Shivarao : సాంబశివరావు కోరుకున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. ఇంకేముంది తనకు మరింత మంచి రోజులు వచ్చాయని సాంబశివరావు భావించారు.. కానీ ఆయన అనుకున్నది వేరు.. క్షేత్రస్థాయిలో జరిగింది వేరు. సాధారణంగా ఒక ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లో హనీమూన్ పీరియడ్ ఉంటుంది.. ఆ తర్వాత అసలు పరిపాలనపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించాల్సి ఉంటుంది.. అధికారులు, సిబ్బందిని నియమించుకోవడం.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సరిదిద్దుకోవడం వాటివి చేపటాల్సి ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాంబశివరావు హఠాత్తుగా టీవీ 5 నుంచి అదృశమయ్యారు. సెప్టెంబర్ 17న ఆయన టీవీ5 నుంచి బయటికి వచ్చారని తెలుస్తోంది. టీవీ5 యాజమాన్యం తో ఏవో అంతర్గత వివాదాల వల్లే సాంబశివరావు బయటికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడుతో సాంబశివరావుకు గ్యాప్ ఉందని జర్నలిజం సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.. సంధ్య కన్వెన్షన్ అధినేతతో ఏర్పడిన గొడవకు సాంబశివరావు టీవీ ఫైవ్ లో ఎక్కువ కవరేజ్ ఇచ్చారని అంతర్గతంగా చర్చ నడిచిందని సమాచారం. రాజ్ న్యూస్ అనే ఛానల్ లో తనమీద సంధ్యా కాన్వెన్షన్ అధినేత వ్యతిరేక వార్తలు ప్రసారం చేయించాడని సాంబశివరావు ఆరోపించారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అందువల్లే టీవీ5లో దానికి కౌంటర్ గా ఆరోపణలు చేశారని తెలుస్తోంది. దీనివల్లే సాంబశివరావును టీవీ 5 పక్కన పెట్టిందని తెలుస్తోంది.

నిలబడుతుందా?

ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక ఛానల్ ముందు వరుసలో నిలబడింది అంటే దాని వెనుక ఎంతో కసరత్తు ఉంటుంది. అయితే ప్రైమ్ టైం న్యూస్ ప్రజెంటర్లు తమ వల్లే న్యూస్ ఛానల్ ఈ స్థాయికి వచ్చిందని చెప్పడం ఇటీవల పరిపాటిగా మారింది. అందులో సాంబశివరావు కూడా ఉన్నారని వినికిడి. అయితే టీవీ5 మంచి బయటికి రావడంతో సాంబశివరావు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ పెట్టుబడిదారుడు ఓ చానల్ మొదలుపెట్టాడు. అందులో సాంబశివరావు చేరారు. ఆ ఛానల్ కు ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఆ ఛానల్ పేరు న్యూస్ 360. సీఈఓ అయిపోయిన తర్వాత సాంబశివరావు కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటున్నారు. ఛానల్ ను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. టీవీ 5 నుంచి వెళ్ళిపోయిన నేపథ్యంలో సాంబశివరావు న్యూస్ 360 ని నిలబెడతారా? సరి కొత్తగా బలోపేతం చేస్తారా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. అన్నట్టు ఈ ఛానల్ ను ఎన్నికల ముందే ప్రారంభించారు.. అయితే ఎన్నికల సమయంలో ఈ ఛానల్ అంతగా ఎస్టాబ్లిష్ కాలేకపోయింది.. మరి ఇప్పుడు ఎన్నికలు లేవు.. పైగా పెద్ద పెద్ద చానల్స్ సరైన బిజినెస్ లేక తలలు పట్టుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో న్యూస్ 360 ఎలా నిలదొక్కుకుంటుందో చూడాలి.