https://oktelugu.com/

Samantha Tweet :  ‘నువ్వే కావాలి’ అంటూ సమంత ఎమోషనల్ ట్వీట్

Samantha Tweet : విభిన్నమైన పాత్రలతో సౌత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్ సమంత..కేవలం ఈమె కోసమే థియేటర్స్ కి క్యూ కట్టే ప్రేక్షకుల సంఖ్య లక్షల్లోనే ఉంటారు..అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్ కాబట్టే ఆమెని పెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా తీస్తున్నారు..అవి బాక్స్ ఆఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ కూడా అయ్యాయి.   అందుకు ఉదాహరణ రీసెంట్ గా విడుదలైన యశోద చిత్రం..ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద […]

Written By:
  • NARESH
  • , Updated On : January 5, 2023 / 10:19 PM IST
    Follow us on

    Samantha Tweet : విభిన్నమైన పాత్రలతో సౌత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్ సమంత..కేవలం ఈమె కోసమే థియేటర్స్ కి క్యూ కట్టే ప్రేక్షకుల సంఖ్య లక్షల్లోనే ఉంటారు..అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్ కాబట్టే ఆమెని పెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా తీస్తున్నారు..అవి బాక్స్ ఆఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ కూడా అయ్యాయి.

     

    అందుకు ఉదాహరణ రీసెంట్ గా విడుదలైన యశోద చిత్రం..ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచి వసూళ్ల పరంగా సమంత కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది..కెరీర్ అలా పీక్ లో పోతున్న సమయంలోనే ఆమెకి మయోసిటిస్ అనే వ్యాధి సోకింది..ప్రస్తుతం ఆమె ఈ వ్యాధికి శస్త్ర చికిత్స చేయించుకుంటుంది..ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు..అంతకు ముందు సోషల్ మీడియా లో బాగా యాక్టీవ్ గా ఉండే సమంత ఈ చికిత్స కోసం చాలా రోజులు సోషల్ మీడియా వాడడం బాగా తగ్గించేసింది.

    అయితే రీసెంట్ గా ఆమె మళ్ళీ సోషల్ మీడియా లో యాక్టీవ్ అవ్వడం ప్రారంభించింది..ఈమధ్యనే అభిమానులతో ఇంట్ర్యాక్ట్ అయ్యింది సమంత..అభిమానులు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాదానాలు చెప్పింది..అయితే ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి సమంత చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

    ఆ అభిమాని సమంత ని ట్యాగ్ చేస్తూ ‘ఎవరో తెలియని ఒక అమ్మాయి కోసం , ఇక్కడ ప్రతీ రోజు పిచ్చోడిలా ఎదురు చూస్తున్నాను..ఆమెని దేవతలుగా ఆరాధిస్తున్నాను..ఆ అమ్మాయి మరెవరో కాదు..అది నువ్వే’ అని అంటాడు..అప్పుడు సమంత ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తూ ‘ఆ అమ్మాయికి నువ్వు కావాలి’ అని సమాధానం చెప్తుంది..ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..కొంతమంది సమంత దురాభిమానులు ఆ ట్వీట్ క్రింద నెగటివ్ కామెంట్స్ కూడా చేసారు.