https://oktelugu.com/

Sakunthalam Talk : విడుదలకు ముందే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ‘శాకుంతలం’.. పాపం గుణశేఖర్ పరిస్థితి ఏంటో!

Sakunthalam Talk :  సమంత ప్రధాన పాత్ర పోషించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం ‘శాకుంతలం’ ఈ నెల 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే.అయితే ముందుగానే ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ ప్రీమియర్ షో ని నిన్న హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ ఐమాక్స్ స్క్రీన్ లో 3D వెర్షన్ ని ప్రదర్శించారు. అయితే సోషల్ మీడియా కారణంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : April 11, 2023 / 08:46 PM IST
    Follow us on

    Sakunthalam Talk :  సమంత ప్రధాన పాత్ర పోషించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం ‘శాకుంతలం’ ఈ నెల 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే.అయితే ముందుగానే ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ ప్రీమియర్ షో ని నిన్న హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ ఐమాక్స్ స్క్రీన్ లో 3D వెర్షన్ ని ప్రదర్శించారు.

    అయితే సోషల్ మీడియా కారణంగా ఈ చిత్రం టాక్ మొత్తం బాగా వైరల్ అయిపోయింది.గ్రాఫిక్స్ అసలు ఏమాత్రం బాగాలేవని, డైరెక్టర్ గుణశేఖర్ స్క్రీన్ ప్లే సరిగా రాసుకోలేదంటూ ఒక టాక్ బయటకి వచ్చింది.అంతే కాదు సమంత డబ్బింగ్ కూడా బాగా చెప్పలేదని, సినిమా మొత్తం ఆడియన్స్ సహనం కి పరీక్ష పెట్టినట్టు ఉందని ఈ చిత్రాన్ని చూసిన ఆడియన్స్ కొంత మంది నిన్న సోషల్ మీడియా లో పోస్టులు పెట్టారు.

    సినిమా గ్రాండ్ గా విడుదల అయ్యే ముందే ఇలాంటి టాక్ రావడం తో మూవీ యూనిట్ మొత్తం బయపడిపోతుంది.ఈ చిత్రాన్ని గుణ శేఖర్ తన డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కించాడు, కేవలం దర్శకత్వం మాత్రమే వహించకుండా, నిర్మాతగా కూడా పాలుపంచుకున్నారు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఈ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించాడు.కానీ టాక్ ఇంత దరిద్రంగా రావడం తో గుండె శేఖర్ కి ఏమి చెయ్యాలో తోచని పరిస్థితి ఏర్పడింది అట.

    ఎందుకంటే ఈ సినిమా తియ్యడానికి ఆయన తన దగ్గరున్న డబ్బు మొత్తాన్ని ఖర్చు చేసాడట.కచ్చితంగా ఆడియన్స్ కి ఈ సినిమా నచుతుంది అనుకున్నాడు కానీ, స్పెషల్ ప్రీమియర్ షో ఆయన కొంప ఇలా ముంచుతుందని మాత్రం ఊహించలేదట.ఈ టాక్ ప్రభావం ఈ చిత్రం పై ఎలా ఉండబోతుందో అని భయపడుతున్నారు.మరి 14 వ తేదీన ఇదే రేంజ్ టాక్ వస్తుందా, లేదా సూపర్ హిట్ టాక్ వస్తుందా అనేది చూడాలి.