https://oktelugu.com/

‘Ravanasura’ Collections : ‘రావణాసుర’ 5 రోజుల వసూళ్లు.. ఇక బ్రేక్ ఈవెన్ కష్టమే!

‘Ravanasura’ 5 Days Collections : వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్న మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రావణాసుర’ ఇటీవలే విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ రవితేజ కి ఉన్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి సుమారుగా 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది రవితేజ కెరీర్ లోనే […]

Written By:
  • NARESH
  • , Updated On : April 11, 2023 / 10:35 PM IST
    Follow us on

    ‘Ravanasura’ 5 Days Collections : వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్న మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రావణాసుర’ ఇటీవలే విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ రవితేజ కి ఉన్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి సుమారుగా 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

    ఇది రవితేజ కెరీర్ లోనే టాప్ 3 బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు.హైప్ పెద్దగా లేకపోయినా కూడా ఈ రేంజ్ వసూళ్లు రావడాన్ని చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయారు.అయితే మొదటి రోజు ఉన్నంత ఊపుని ఈ చిత్రం ఫుల్ రన్ లో కొనసాగించలేకపోతుంది.అందుకు కారణం టాక్ లేకపోవడమే.22 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి 5 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాము.

    మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే వచ్చినప్పటికీ నాల్గవ రోజు మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయాయి.రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి నాల్గవ రోజు కేవలం 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.ఇక ఐదవ రోజు అయితే నాల్గవ రోజు కంటే దారుణంగా పడిపోయిందని,కనీసం పాతిక లక్షల రూపాయిల షేర్ వసూళ్లను అయినా రాబడుతుందో లేదో అని బయ్యర్స్ భయపడుతున్నారు.

    అలా మొత్తం మీద 5 రోజులకు కలిపి ఈ సినిమా 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ చిత్రం మరో 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి.అది దాదాపుగా అసాధ్యం అనే అంటున్నారు.ఈ వీకెండ్ లో కూడా ఆడియన్స్ మొదటి ఛాయస్ దసరా నే అవుతుందని,రావణాసుర కి ఇక వసూళ్లు రావడం కష్టమే అని, ఫుల్ రన్ లో యావరేజి గా కూడా నిలిచే అవకాశం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.