RGV : ఏపీ పోలీసోళ్లు తిడుతుంటే ఏం చేస్తున్నారు.. రెచ్చగొట్టిన రాంగోపాల్ వర్మ

RGV : సమకాలిన రాజకీయ అంశాలపై స్పందించడంలో ముందుంటారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సినీ దర్శకుడుగా ఉన్న ఆయన ఇప్పుడు రాజకీయ దర్శకత్వం చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నాయకులను టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. గత ఎన్నికల నుంచి ఇప్పటివరకూ ఆయన టీడీపీపైనే ఎక్కువగా గురిపెట్టారు. ఏపీ సీఎం జగన్ కు అనుకూలంగా టీడీపీకి వ్యతిరేకంగా సినిమాలు తీశారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో మరికొన్ని సినిమాలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. కానీ అవేవీ పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఏకంగా కొంతమంది […]

Written By: NARESH, Updated On : January 29, 2023 1:16 pm
Follow us on

RGV : సమకాలిన రాజకీయ అంశాలపై స్పందించడంలో ముందుంటారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సినీ దర్శకుడుగా ఉన్న ఆయన ఇప్పుడు రాజకీయ దర్శకత్వం చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నాయకులను టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. గత ఎన్నికల నుంచి ఇప్పటివరకూ ఆయన టీడీపీపైనే ఎక్కువగా గురిపెట్టారు. ఏపీ సీఎం జగన్ కు అనుకూలంగా టీడీపీకి వ్యతిరేకంగా సినిమాలు తీశారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో మరికొన్ని సినిమాలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. కానీ అవేవీ పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఏకంగా కొంతమంది టీడీపీ నాయకుల వ్యవహార శైలిని తప్పుపడుతూ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పోలీసులను రెచ్చగొట్టేలా ఆ వీడియో ఉంది. మిమ్మల్ని టీడీపీ నేతలు అంతలా తిడుతుంటే ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదని పోలీసుల అధికారులను ప్రశ్నించారు. వారిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గురించి ప్రధానంగా ప్రస్తావించారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన నోటిని సబ్బు నీటితో కడగాలని కూడా సలహా ఇచ్చారు. వెధవ అంటూ సంభోదించారు. పురాణ పేర్లు పెట్టుకొని అలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. ప్రభుత్వం పోలీస్ శాఖ పవర్ ఫుల్అని.. అటువంటి శాఖపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిని ఇలా ఎందుకువిడిచిపెడుతున్నారని ప్రశ్నించారు. ఇలా అయితే భావితరాలు మీకు ఎలా గౌరవిస్తాయని కూడా వ్యాఖ్యానించారు. తానొక ఫిల్మ్ మేకర్ గా కాదని.. కామన్ మేన్ గా మాత్రమే స్పందిస్తున్నట్టు చెప్పారు. రాజకీయ నాయకులు అనుచితంగా మాట్లాడుతుంటే మీరెందుకు కరెక్ట్ గా స్పందించడం లేదని ఆర్జీవీ ప్రశ్నించారు.

అచ్చెన్నాయుడిని భిక్షం నాయుడిగా రామ్ గోపాల్ వర్మ అభివర్ణించారు. ఇటీవల యువగళం పాదయాత్రలో అచ్చెన్నాయుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రకు ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించడంలో కావాల్సే వివక్ష చూపుతుందని ఆరోపిస్తూ ఆగ్రహంగా మాట్లాడారు. 500 మంది పోలీసులను నియమించారని.. వారు ఎటువెళ్లిపోయారని ప్రశ్నించే క్రమంలో ఆయన నోటి నుంచి పోలీసుల గురించి పురుషమైన పదజాలం వచ్చింది. అటు అయ్యన్నపాత్రుడు సైతం త్వరలో టీడీపీ అధికారంలోకి వస్తుందని.. హోంమంత్రిని అవుతానని.. అప్పుడు తన ప్రతాపం చూపిస్తానని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కంటే రామ్ గోపాల్ వర్మ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి,. ఐ ప్యాక్ టీమ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆర్జీవీ స్పందించి ఉంటారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో విపక్షాలపై ప్రభుత్వం, పోలీసులు గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నప్పుడు స్పందించని ఆర్జీవీ ఇప్పుడెందుకు స్పందిస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే కేవలం ఫిల్మ్ మేకర్ గా ఆర్జీవీ స్పందించి ఉంటే అందరూ పట్టించుకునే వారు. కానీ ఆయన ఇటీవల తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద తరచూ కనిపిస్తున్నారు. పవన్, చంద్రబాబులకు వ్యతిరేకంగా సినిమా తీస్తానని కూడా ప్రకటించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన వ్యాఖ్యలను ఎక్కువ మంది లైట్ తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు పోలీస్ శాఖను రెచ్చగొట్టేల వ్యాఖ్యానాలు చేయడం, సలహా ఇవ్వడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.