Rakul Preet Singh: టాలీవుడ్ ని దున్నేసిన హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో వెలుగులోకి వచ్చిన ఈ పంజాబీ చిన్నది ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ అందరినీ కవర్ చేసింది. ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో జతకట్టారు. పవన్, ప్రభాస్ లతో నటించే ఛాన్స్ మాత్రం దక్కలేదు. బాలీవుడ్ కి షిఫ్ట్ కావడంతో వారితో కాంబో సెట్ కాలేదు. మరోవైపు తెలుగు ప్రేక్షకులు ఆమెను మర్చిపోయారు. దర్శక నిర్మాతలు కూడా పట్టించుకోవడం మానేశారు. కారణం ఆమెకు వరుస ప్లాప్స్ పడ్డాయి.

రకుల్ కెరీర్లో 2016 బెస్ట్ ఇయర్. ఆ ఏడాది ముగ్గురు టాప్ స్టార్స్ కి రకుల్ హిట్స్ ఇచ్చింది. ఎన్టీఆర్ తో చేసిన నాన్నకు ప్రేమతో, బన్నీతో జతకట్టిన సరైనోడు, చరణ్ తో చేసిన ధృవ సూపర్ హిట్ అందుకున్నాయి. తర్వాత టాలీవుడ్ లో ఆమెకు చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. జయ జానకి నాయక పర్లేదు అనిపించుకుంది. 2021లో చెక్, కొండపొలం చిత్రాల్లో రకుల్ హీరోయిన్ గా నటించారు. అవి రెండు డిజాస్టర్ అయ్యాయి. పూర్తిగా టాలీవుడ్ కి దూరమైన రకుల్ నుండి 2021లో ఒక్క చిత్రం కూడా రాలేదు.
అయితే బాలీవుడ్ లో రకుల్ నటించిన 5 చిత్రాలు విడుదలయ్యాయి. నెలల, వ్యవధిలో రకుల్ నటించిన చిత్రాలు థియేటర్స్, ఓటీటీలో విడుదలయ్యాయి. అయితే ఒక్కటి కూడా విజయం సాధించలేదు. అటాక్, రన్ వే 34, డాక్టర్ జి, థాంక్ గాడ్ వరుసగా ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ ఏడాది బాలీవుడ్ ని దురదృష్టం వెంటాడగా దాదాపు విడుదలైన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. రకుల్ నటించిన నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. ఒక్కటి కూడా ఆదరణకు నోచుకోలేదు. కట్ పుట్లీ చిత్రం మాత్రం నేరుగా ఓటీటీలో విడుదల చేశారు.

అయినప్పటికీ ఆమె చేతిలో మరో రెండు బాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి. అలాగే భారతీయుడు 2 మూవీతో పాటు ఒక తమిళ చిత్రం చేస్తున్నారు. ఇక 2021 బర్త్ డే నాడు జాకీ భగ్నానీ తన ప్రియుడంటూ పరిచయం చేసింది. అప్పటి నుండి పెళ్లి ఎప్పుడంటూ మీడియా వేధిస్తుంది. ఈ ప్రశ్న రకుల్ ని ఆగ్రహానికి గురి చేస్తుంది. ఆ మధ్య రకుల్ తమ్ముడు వచ్చే ఏడాది రకుల్-జాకీ వివాహం ఉండొచ్చంటూ హింట్ ఇచ్చాడు. తాజాగా రకుల్ ప్రియుడితో పాటు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. క్రిస్మస్ పార్టీ కోసం చాలా ట్రెండీగా తయారైంది రకుల్. సదరు ఫోటోలు ఫ్యాన్స్ తో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.