Prudhvi Raj: కమెడియన్ ఫృథ్వీ కూడా జనసేన జెండా ఎత్తేశాడు. వచ్చే ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాన్ కింగ్ మేకర్ అవుతాడని.. 40 సీట్ల వరకూ సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. నేను రాసిస్తున్నానని.. జనసేన జెండా రాష్ట్రంలో ఎగురుతుందని.. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 40 సీట్లు కొట్టబోతున్నాడని.. పవన్ కళ్యాణ్ కింగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలోని తన సొంతూరు చొళ్లంగిలో పర్యటించిన ఫృథ్వీ ఫస్ట్ టైం తన కులం ఏంటో బయటపెట్టాడు. తాను కాపు కులంలో పుట్టిన బిడ్డగా చెబుతున్నానని.. జనసేనదే అధికారం అని పవన్ కళ్యాణ్ పై అభిమానం చాటుకున్నారు.
ఇదే ఫృథ్వీ వైసీపీలో ఉండగా పవన్ కళ్యాన్ పై దారుణ వ్యాఖ్యలే చేశారు. పవన్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేశారు. వైసీపీలో కొన్నేళ్ల క్రితం చేరిన ఫృథ్వీకి 2019లో వైసీపీ కోసం ఎంతో ప్రచారం చేశారు. ఆ పార్టీ గెలవడంతో ఏకంగా తిరుమల ఎస్వీబీసీ చానెల్ చైర్మన్ పదవిని దక్కించుకున్నాడు..
జగన్ ను దేవుడు అన్న ఇదే ఫృథ్వీ.. ఆ చానెల్ లో పనిచేస్తున్న ఒక మహిళతో ఆడియో లీక్ కావడం.. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో వైసీపీ ప్రభుత్వం ఫృథ్వీని పదవిలోంచి తొలగించింది. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ఫృథ్వీ వైసీపీపై ఇప్పటివరకూ కామెంట్ చేయలేదు.
కానీ తాజాగా వైసీపీపై దారుణ వ్యాఖ్యలు చేశారు. మరోసారి జగన్ పిలిస్తే వైసీపీలోకి వెళతారా? అంటే మండిపడ్డారు. . ‘చాలండి నమస్కారమండీ.. ’ అంటానని బదులిచ్చాడు. వెళ్లే వాళ్లకైనా సిగ్గు, శరం ఉండాలి. నేనెప్పుడూ కులం గురించి మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెబుతున్నా.. తూర్పుగోదావరి జిల్లా చోళ్లంగిలో పుట్టిన కాపు బిడ్డగా చెబుతున్నా.. అలాంటి పనులు మా జాతిలో ఎవడూ చేయడు’ అని ఫృథ్వీ నిప్పులు చెరిగారు. మళ్లీ వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదన్నట్టుగా ఫృథ్వీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫృథ్వీ అడుగులు కూడా జనసేన వైపు పడుతున్నాయని అర్థమవుతున్నాయి.
ఇలాంటోళ్ళు ఎంతమంది కలిసి రాష్ట్రాన్ని నాశనం చేసారో 😠 pic.twitter.com/a28qBesK1r
— Venu M Popuri (@Venu4TDP) June 20, 2022