Pawan Kalyan ‘Khushi’ Movie : ‘ఖుషి’ థియేటర్ లో భోగి మంట వేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. వైరల్ గా మారిన వీడియో

Pawan Kalyan ‘Khushi’ Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ని థియేటర్స్ తట్టుకోవడం చాలా కష్టమే.. ఆయన సినిమా విడుదల అయ్యిందంటే చాలు అభిమానుల కోలాహలం తో థియేటర్స్ ఎక్కడ బద్దలైపోతాయో అని భయపడిపోతుంటారు..గతం లో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి కూడా..ఇక గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు వేసుకున్న జల్సా స్పెషల్ షోస్ కి కూడా అభిమానుల కోలాహలం థియేటర్స్ లో ఒక రేంజ్ లో […]

Written By: NARESH, Updated On : June 30, 2023 4:18 pm
Follow us on

Pawan Kalyan ‘Khushi’ Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ని థియేటర్స్ తట్టుకోవడం చాలా కష్టమే.. ఆయన సినిమా విడుదల అయ్యిందంటే చాలు అభిమానుల కోలాహలం తో థియేటర్స్ ఎక్కడ బద్దలైపోతాయో అని భయపడిపోతుంటారు..గతం లో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి కూడా..ఇక గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు వేసుకున్న జల్సా స్పెషల్ షోస్ కి కూడా అభిమానుల కోలాహలం థియేటర్స్ లో ఒక రేంజ్ లో ఉన్నింది.. కానీ ఆ సమయం లోనే థియేటర్స్ లో సీట్స్ విరిగిపోయాయి.

స్క్రీన్స్ చిరిగిపోయాయి, థియేటర్స్ అద్దాలు పగిలిపోయాయి..ఇలా చాలానే జరిగాయి..అప్పటి నుండి పవన్ కళ్యాణ్ సినిమాలకు స్పెషల్ షోస్ నిర్వహించడానికి కొన్ని మెయిన్ థియేటర్స్ నిరాకరించాయి..ఇక నిన్న ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయిన ఖుషి సినిమాని రీ రిలీజ్ చేసాడు ఆ చిత్ర నిర్మాత AM రత్నం..రెస్పాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చింది..ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

ఒక కొత్త సినిమా విడుదలైతే ఎలాంటి హంగామా ఉంటుందో ఈ సినిమాకి అంతకు మించి హంగామా చేసారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..సోషల్ మీడియా మొత్తం ఖుషి మేనియా తో మునిగిపోయింది..ఎక్కడ చూసిన థియేటర్స్ లో చేసిన సంబరాల వీడియోస్ కనిపిస్తున్నాయి..అయితే అభిమానం ఎప్పటికి మితిమీరకూడదు..నిన్న అలాంటి సంఘటనే చోటు చేసుకుంది.

ఇక అసలు విషయానికి వస్తే జగ్గయ్య పేట లోని కమల అనే థియేటర్ లో నిన్న ఖుషి సినిమాని ప్రదర్శించారు..అభిమానులు కాస్త అత్యుత్సాహం తో థియేటర్ లో పడిన పేపర్స్ అన్నిటిని పోగు చేసి బోగి మంట వెయ్యడం పెద్ద కలకలం రేపింది..దానికి సమందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూసేయండి..ఇలా చేస్తే ఇక రీ రిలీజ్ లకు థియేటర్స్ ఇవ్వబోము అంటూ థియేటర్స్ యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి.