Pawan Kalyan – OG : గూస్ బంప్స్ లేపుతున్న OG లీక్డ్ లుక్… హైప్ తో చచ్చిపోతే ఎవరు గ్యారంటీ సుజీత్!

Pawan Kalyan – OG : సాహో ఫేమ్ సుజీత్ ఒక్కో అప్డేట్ తో OG చిత్రం మీద హైప్ పెంచేస్తున్నాడు. హింట్స్ తో కూడిన ప్రకటన పోస్టర్ ఎక్కడ లేని క్యూరియాసిటీ పెంచింది. ఇటీవల విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో నెక్స్ట్ లెవెల్ అన్నట్లు ఉంది. ఫ్యాన్ బాయ్ సుజీత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నాడని అర్థం అవుతుంది. ఆయన టాలెంట్ ప్రతి అప్డేట్ లో కనిపిస్తుంది. ఇటీవల OG […]

Written By: NARESH, Updated On : ఏప్రిల్ 20, 2023 6:59 సా.
Follow us on

Pawan Kalyan – OG : సాహో ఫేమ్ సుజీత్ ఒక్కో అప్డేట్ తో OG చిత్రం మీద హైప్ పెంచేస్తున్నాడు. హింట్స్ తో కూడిన ప్రకటన పోస్టర్ ఎక్కడ లేని క్యూరియాసిటీ పెంచింది. ఇటీవల విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో నెక్స్ట్ లెవెల్ అన్నట్లు ఉంది. ఫ్యాన్ బాయ్ సుజీత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నాడని అర్థం అవుతుంది. ఆయన టాలెంట్ ప్రతి అప్డేట్ లో కనిపిస్తుంది. ఇటీవల OG షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో సెట్స్ నుండి పవన్ కళ్యాణ్ లుక్ లీకైంది.

బ్లూ షర్ట్, జీన్స్ ధరించి, గాగుల్స్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతున్న పవన్ మాస్ అండ్ హ్యాండ్సమ్ లుక్ కేక పుట్టించింది. OGలో సుజీత్ పవన్ ని నెవెర్ బిఫోర్ బెస్ట్ లుక్ లో ప్రెజెంట్ చేయనున్నాడని అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ OG ప్రాజెక్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఆ లుక్ చూసిన ఫ్యాన్స్… హైప్ తో చచ్చిపోతే గ్యారంటీ ఎవరని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇది పవన్ బెస్ట్ లుక్ అని చెప్పొచ్చు.

OG గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఆర్ ఆర్ ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మిస్తున్నారు. పవన్ కి జంటగా యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ ని తీసుకున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా జరిగింది. తెలుగులో ప్రియాంక గ్యాంగ్ లీడర్, శ్రీకారం చిత్రాల్లో నటించారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మొత్తంగా OG ప్రాజెక్ట్ తో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

కాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. దర్శకుడు క్రిష్ హరి హర వీరమల్లు టైటిల్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కి సిద్ధం అవుతుంది. ఇక హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. సాయి ధరమ్ తేజ్ తో వినోదయ సితం రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం కొంత మేర షూటింగ్ జరుపుకుంది.