Pawan Kalyan ‘Khushi’ : 7వ రోజు అద్భుతాలు సృష్టించిన పవర్ స్టార్ ‘ఖుషి’ చిత్రం

Pawan Kalyan ‘Khushi’ : ఆరోజుల్లో రీ రిలీజ్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ ని దున్నేసేవని ట్రేడ్ పండితులు చెప్తూ ఉంటే ‘అవునా’ అని ఆశ్చర్యపోతూ వినేవాళ్ళం..ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ సినిమా రీ రిలీజ్ ద్వారా సృష్టిస్తున్న బాక్స్ ఆఫీస్ ప్రకంపనలు కళ్లారా చూస్తున్నాము..కొత్త సినిమాలు వారం రోజులకే థియేటర్స్ నుండి సర్దేస్తున్న ఈ కాలం లో 22 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా ఇలాంటి అద్భుతాలు సృష్టించడమా అని పవన్ కళ్యాణ్ […]

Written By: NARESH, Updated On : January 6, 2023 8:34 pm
Follow us on

Pawan Kalyan ‘Khushi’ : ఆరోజుల్లో రీ రిలీజ్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ ని దున్నేసేవని ట్రేడ్ పండితులు చెప్తూ ఉంటే ‘అవునా’ అని ఆశ్చర్యపోతూ వినేవాళ్ళం..ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ సినిమా రీ రిలీజ్ ద్వారా సృష్టిస్తున్న బాక్స్ ఆఫీస్ ప్రకంపనలు కళ్లారా చూస్తున్నాము..కొత్త సినిమాలు వారం రోజులకే థియేటర్స్ నుండి సర్దేస్తున్న ఈ కాలం లో 22 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా ఇలాంటి అద్భుతాలు సృష్టించడమా అని పవన్ కళ్యాణ్ ని విమర్శించేవాళ్ళు కూడా ముక్కు మీద వేలేసుకునేలా చేసింది.

ప్రస్తుతం ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ ని కొట్టే హీరోనే లేడని వాళ్ళ నోటి నుండే అనిపించేలా చేసింది ఈ చిత్రం..మొదటి రోజు అక్షరాలా నాలుగు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం వారం రోజులకు కలిపి 7 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..ఇందులో థియేట్రికల్ షేర్ 4 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా.

ఇక ఈ సినిమా కి 7 వ రోజు చాలా చోట్ల జనాలు క్యూ కట్టేసారు..కొన్ని ముఖ్యమైన సిటీస్ లో ఈ చిత్రానికి ఇదే ఆఖరి రోజు..ఎందుకంటే రేపటి నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ఒక్కడు సినిమా రీ రిలీజ్ అవ్వబోతుంది..దీనితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక సరికొత్త ట్రెండ్ కి తెరలేపుతూ ‘ఫేర్ వెల్’ షోస్ పేరిట ప్రస్తుతం ఆడుతున్న థియేటర్స్ లో చివరి షో కి వెళ్లి మరోసారి సంపూర్ణంగా ఖుషి చిత్రాన్ని ఎంజాయ్ చేద్దాం అని ఒక ప్రకటన చేశారు.

ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో , అభిమానులు థియేటర్స్ కి పోటెత్తారు..హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి..దానితో 7 వ రోజు ఈ చిత్రం కేవలం నైజాం ప్రాంతం నుండే 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..ఓటీటీ రాజ్యం ఏలుతున్న ఈ రోజులలో ఒక రీ రిలీజ్ కి ఈ రేంజ్ ఫుల్స్ పెట్టడం అంటే సాధారణమైన విషయం కాదు.