Pathaan movie Collections : గడ్డు కాలం ని ఎదురుకుంటున్న బాలీవుడ్ కి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చిన సినిమా ‘పఠాన్’.సుమారుగా నాలుగేళ్ల విరామం తర్వాత షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ఈ యాక్షన్ మూవీ బాలీవుడ్ సినిమాల రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం టాప్ 4 సినిమాలలో ఒకటిగా నిలిచింది.
మొదటి స్థానం లో బాహుబలి 2 దాదాపుగా 2000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లతో నెంబర్ 1 స్థానం లో ఉండగా, రెండవ స్థానం లో KGF చాప్టర్ 2 1200 కోట్ల రూపాయిల గ్రాస్ తో కొనసాగుతుంది.ఇక మూడవ స్థానం లో #RRR 1100 కోట్ల రూపాయిల గ్రాస్ నిలవగా, పఠాన్ చిత్రం 1011 కోట్ల రూపాయిల గ్రాస్ తో టాప్ 4 స్థానం లో కొనసాగుతుంది.అయితే ‘పఠాన్’ రన్ ఇంకా ముగియలేదు.రీసెంట్ గా విడుదలైన సినిమాలన్నీ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో ఆడియన్స్ ఇప్పటికీ ‘పఠాన్’ మూవీ నే మొదటి ఛాయస్ గా ఎంచుకున్నారు.
ఇప్పటికి 32 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి 50 రోజుల వరకు బాలీవుడ్ లో గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.కాబట్టి మరో 30 నుండి 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టొచ్చు.అంటే మన #RRR రికార్డు ని అందుకోవడం కష్టమే అన్నమాట.కానీ #RRR సినిమాకి బాలీవుడ్ మార్కెట్ తో పాటుగా సౌత్ మార్కెట్ కూడా చాలా పెద్దది, అందుకే ఆ రేంజ్ వసూళ్లు వచ్చాయి.కానీ పఠాన్ చిత్రానికి కేవలం నార్త్ మార్కెట్ తప్ప సౌత్ మార్కెట్ లేదు.సౌత్ లో కూడా ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో హిందీ వెర్షన్ కి మాత్రమే వసూళ్లు వచ్చాయి.తెలుగు , తమిళం మరియు మలయాళం బాషలలో వచ్చిన వసూళ్లు చాలా తక్కువ.
అందుకే షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రం ‘జవాన్’ తో సౌత్ మార్కెట్ ని గట్టిగా టార్గెట్ చేసాడు.సౌత్ ఇండియన్ టాప్ మోస్ట్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించబోతున్నాడు.తద్వారా సౌత్ మార్కెట్ లో పాగా వెయ్యాలని షారుఖ్ ఖాన్ ప్లాన్.మరి ఆయన ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.