‘Orange’ re-release : ‘ఆరెంజ్’ రీ రిలీజ్ కలెక్షన్స్ క్రెడిట్ ఎవరిదీ..? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్లే ఇంత వసూళ్లు వచ్చాయా!

‘Orange’ re-release : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన ‘ఆరెంజ్’ సినిమాని రీ రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమా అప్పట్లో ఫ్లాప్ అయ్యుండొచ్చు ఏమో కానీ,రీ రిలీజ్ లో మాత్రం ఎవ్వరు ఊహించని వసూళ్లను రాబట్టి ట్రేడ్ పండితులను సైతం నోరెళ్లబెట్టేలా చేసింది. ఇది వరకు కేవలం సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అవ్వడం, అవి […]

Written By: NARESH, Updated On : March 29, 2023 10:25 pm
Follow us on

‘Orange’ re-release : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన ‘ఆరెంజ్’ సినిమాని రీ రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమా అప్పట్లో ఫ్లాప్ అయ్యుండొచ్చు ఏమో కానీ,రీ రిలీజ్ లో మాత్రం ఎవ్వరు ఊహించని వసూళ్లను రాబట్టి ట్రేడ్ పండితులను సైతం నోరెళ్లబెట్టేలా చేసింది.

ఇది వరకు కేవలం సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అవ్వడం, అవి సూపర్ హిట్ సాధించడం వంటివే మనం చూసాము, మొట్టమొదటిసారి ఒక డిజాస్టర్ సినిమా కి ఈ రేంజ్ వసూళ్లు రావడం మాత్రం ‘ఆరెంజ్’ సినిమాకి మాత్రమే చూసాము.ఇప్పుడు టాలీవుడ్ లో రీ రిలీజ్ చిత్రాలలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఖుషి మరియు జల్సా తర్వాత టాప్ 3 స్థానం లో నిల్చింది ‘ఆరెంజ్’ చిత్రం.

అయితే ఈ సక్సెస్ క్రెడిట్ ఎవరిదీ అనే విషయం పై సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ నడుస్తుంది.జనసేన పార్టీ కి డొనేషన్స్ ఇస్తాము అని చెప్పబట్టే మేము ఈ చిత్రాన్ని ఆ రేంజ్ లో చూసాము, మా వల్లే ఈ వసూళ్లు సాధ్యపడ్డాయి అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు.లేదు మా వల్లే అని రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా అంటున్నారు, అలా వాళ్ళిద్దరి మధ్య గత మూడు రోజుల నుండి ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ లో ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి.

అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం ఇది మెగా ఫ్యామిలీ యూనిటీ గా ఉండడం వల్లే రికార్డు సాధ్యమైందని, మొదటి రోజు వసూళ్ల క్రెడిట్ లో సింహభాగం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి దక్కుతుందని, కానీ రెండవ రోజు నుండి వస్తున్న వసూళ్లు మొత్తం రామ్ చరణ్ పేరు మీదనే వచ్చాయని అంటున్నారు. ఏది ఏమైనా ఒక డిజాస్టర్ సినిమాకి ఈ రేంజ్ వసూళ్లు రావడం అనేది చరిత్రలో ఎప్పటికి మర్చిపోలేనిది, చిరస్థాయిగా గుర్తించుకోవాల్సిన విషయం గా మనం పరిగణించొచ్చు.