
NTR: టాలీవుడ్ నుండి దేశం గర్వించ దగ్గ నేటి తరం హీరోలలో ఒకడు జూనియర్ ఎన్టీఆర్.చిన్న వయస్సులోనే విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఈ హీరో, ఇప్పుడు #RRR చిత్రంతో పాన్ వరల్డ్ స్టార్ గా అవతరించాడు.ఇదంతా కాసేపు పక్కన పెడితే ఇన్నేళ్ల ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఒక్క ఆరోపణ కూడా ఉండేది కాదు, కానీ రెండేళ్ల క్రితం ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారమే రేపింది.
జూనియర్ ఎన్టీఆర్ తో ఆయన ‘టెంపర్’ మరియు ‘బాద్షా’ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసాడు.అయితే టెంపర్ సినిమా సమయం లో విడుదలకు దగ్గరగా ఉంది అనగా జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ ని పూర్తి చెయ్యాల్సి ఉంది.కానీ ఆయన అప్పట్లో క్లియర్ చెయ్యాల్సిన రెమ్యూనరేషన్ మొత్తాన్ని క్లియర్ చేసిన తర్వాతే డబ్బింగ్ చెప్తానని, లేకుంటే చెప్పను అంటూ అన్నాడని ఆరోజుల్లో బండ్ల గణేష్ ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కామెంట్స్ చేసాడు.
అప్పట్లో దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు, దీనితో బండ్ల గణేష్ రియాక్ట్ అవుతూ ‘ఎన్టీఆర్ చాలా గొప్పోడు, మంచి మనిషి , కానీ కొంతమంది చెప్పుడు మాటలు విని ఆయనతో విబేధించాల్సి వచ్చింది కానీ ఎన్టీఆర్ కి నాకు మధ్య ఎలాంటి ఇష్యు లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్.

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఈ నేపథ్యం లో రామ్ చరణ్ ఫ్యాన్స్ గతం లో బండ్ల గణేష్ ఎన్టీఆర్ మీద చేసిన కామెంట్స్ ని పోస్ట్ చేస్తూ ట్రోల్ చేసారు.ఇక ఎన్టీఆర్ ఈనెల 18 వ తేదీన కొరటాల తో చెయ్యబొయ్యే సినిమాని ప్రారంభించబోతున్నాడు,ఆ రోజే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుంది.జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కాబోతుంది.