Site icon OkTelugu

NTR On Oscar: ఆస్కార్ వేడుకపై పులిని చూపించిన ఎన్టీఆర్

NTR On Oscar
NTR On Oscar

NTR On Oscar: ‘నాటు నాటు’ కు ఆస్కార్ అవార్డు రావడంతో సినీ ఇండస్ట్రీ జోష్ లో ఉంది. ఈ సందర్భంగా ట్రిపుల్ ఆర్ టీంకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగ ఆస్కార్ ఫంక్షన్లో ఈ మూవీ టీం సందడి చేసింది. అక్కడి సినీ నటులతో ఫొటోలు దిగుతూ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా నిలిచారు. ఈవెంట్ కు ఆయన షేర్వానీలో కనిపించి మెరిశారు. ఆయన షేర్వానిపై ఉన్న పులిబొమ్మపై ఆసక్తికర చర్చ సాగింది. ఈ సందర్భంగా ఆస్కార్ వేడుకకు వచ్చిన ఓ రిపోర్టర్ తన షేర్వాని గురించి అడగ్గా.. ఆయన చెప్పిన సమాధానం హాట్ టాపిక్ అయింది.

‘నాటు నాటు’ సాంగ్ లో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటించారు. ఈ సాంగ్ లోనే కాకుండా సినిమా మొత్తంలో ఎన్టీఆర్ నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆయన పులితో చేసిన ఫైట్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక ఈ పులి బొమ్మ ఉన్న షేర్వానిని ఎన్టీఆర్ ఆస్కార్ ఫంక్షన్ కు అటెంట్ అయ్యారు. దీంతో అందరి దృష్టి ఈ పులి బొమ్మపై పడింది. కొందరు ఈ పులిబొమ్మ ఉన్న షేర్వానిని ఎన్టీఆర్ ఎందుకు ధరించారని గుసగుసలాడారు. ఈ పరిస్థితిని గమనించిన ఓ రిపోర్టర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లి అదే ప్రశ్న వేశారు.

‘మీ డ్రెస్ మీద ఆ టైగర్ బొమ్మ ఎందుకు?’ అని ఆయన అడగ్గా.. ‘ఇది సినిమాలో నాతో ఫైట్ చేసిన ఫులి.. నేను ఆర్ఆర్ఆర్ యాక్టర్ ను కాదు.. మాది ఇండియా అని చెప్పడానికే ఈ చిహ్నం ’ అని చెప్పారు. అలా ఆయన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇతరులు ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తానో వ్యక్తిగా కాకుండా ఇండియన్ గా చెప్పడం గ్రేట్ అంటూ అభినందిస్తున్నారు. ఇక ఫ్యాన్ష్ ఎన్టీఆర్ హీరో మాత్రమే కాదని, దేశభక్తి ఉన్న వ్యక్తి అని కొనియాడుతున్నారు.

NTR On Oscar

ఈ సందర్భంగా ఎన్టీఆర్ వేదికపైకి వచ్చి మాట్లాడారు. ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ కచ్చితంగా ఉంటుదని, కానీ ఎప్పుడో అనేది ఇప్పుడే చెప్పలేం అన్నారు. దీంతో అక్కడికి వచ్చిన వాళ్లు ఆసక్తిగా ఎన్టీఆర్ స్పీచ్ ను విన్నారు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ సినిమాతో బిజీ అయ్యాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత ఆర్ఆర్ఆర్ 2లో నటిస్తారా? లేక మరికొన్ని సినిమాల తరువాతనా? అని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

Exit mobile version