Naresh- Ramya Raghupathi: గత ఏడాది నుండి నేటి వరకు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం సీనియర్ హీరో నరేష్ నాల్గవ పెళ్లి వ్యవహారం..ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో చాలా కాలం నుండి నరేష్ డేటింగ్ లో ఉన్నాడు..న్యూ ఇయర్ సందర్భంగా మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ ఒక వీడియో ద్వారా అధికారిక ప్రకటన చేసాడు నరేశ్.

ఈ వీడియో లో నరేష్ పవిత్ర లిప్ లాక్ చేసుకోవడం సోషల్ మీడియా లో పెద్ద సెన్సేషన్ అయ్యింది..తాత వయస్సులో ఏంటి ఈ వేషాలు అంటూ నెటిజెన్స్ నరేష్ పై విరుచుకుపడ్డారు కూడా..మరో వైపు నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకు వచ్చి నరేష్ పై ఎలాంటి సంచలన ఆరోపణలు చేసిందో మన అందరికీ తెలిసిందే..అప్పుడు నరేష్ తన మూడవ భార్య కి నా డ్రైవర్ తో అక్రమ సంబంధం ఉంది అంటూ ఒక సంచలన ఆరోపణ చేసాడు.
నరేష్ ఎప్పుడైతే ఆ ఆరోపణ చేసాడో..ఆ మరుసటి రోజే రమ్య బెంగళూరు లో ఒక హోటల్ లో ఉంటున్న నరేష్ – పవిత్ర రూమ్ కి వెళ్లి చెప్పు తో కొట్టే ప్రయత్నం చేసింది..దానికి సంబంధించిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది..అయితే ఇప్పుడు రమ్య రఘుపతి కాస్త వెనక్కి తగ్గినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..నరేష్ ఆమెకి విడాకులు ఇస్తూనే 20 కోట్ల రూపాయిలు ఇస్తాను అంటూ ఆఫర్ చేసాడట..తొలుత రమ్య అందుకు ఒప్పుకోలేదు.

కానీ రమ్య ఇంట్లో పెద్దలు పరిస్థితి ఇలాగే కొనసాగితే నష్టం తప్ప ఇరువురికి నయా పైసా లాభం ఉండదు..పైగా పరువు కూడా పోతుంది.,కాబట్టి ఆ 20 కోట్ల రూపాయిలు తీసుకొని విడాకులకు ఒప్పుకోమంటూ రమ్య కుటుంబ సభ్యులు చెప్పారట..దీనితో రమ్య ఆ ఆఫర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..మొత్తానికి ఏడాది కాలం నుండి హాట్ టాపిక్ గా మారిన ఈ అంశం కి ఇలా తెరబడబోతుంది అన్నమాట.