https://oktelugu.com/

‘Son of India’ Movie Collections : ‘సన్నాఫ్ ఇండియా’ తొలి రోజు కలెక్షన్లు షాకింగ్.. ఎంతో తెలిస్తే ఫసక్కే

Mohan Babu ‘Son of India’ Movie First Day Collections : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చేసిన ప్రయోగాత్మక చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత మోహన్ బాబు హీరోగా వస్తున్నారు. చిరంజీవి వాయిస్ ఓవర్ తో విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దేశభక్తి నేపథ్యంలో చాలా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 17, 2022 / 09:27 PM IST
    Follow us on

    Mohan Babu ‘Son of India’ Movie First Day Collections : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చేసిన ప్రయోగాత్మక చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత మోహన్ బాబు హీరోగా వస్తున్నారు. చిరంజీవి వాయిస్ ఓవర్ తో విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దేశభక్తి నేపథ్యంలో చాలా గ్రాండ్ గా రూపొందిన ఈ సినిమాను ఫిబ్రవరి 18న(శుక్రవారం) విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ఫిబ్రవరి 18న శుక్రవారం రిలీజ్ అయ్యింది.

    దేశభక్తి ప్రధానంగా ‘సన్నాఫ్ ఇండియా’ చిత్రం రూపొందింది. ఈ చిత్రం కాన్సెప్ట్ చూస్తే క్రిమినల్స్ పై పోరాడి జైలు పాలైన ఒక వ్యక్తి కథ. ఒక రాజకీయ నాయకుడి కారణంగా అమాయకమైన వ్యక్తి ఎలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అన్యాయంగా ఎలా జైలుకు వెళ్లాడు..? ఇలాంటి ఎన్నో అంశాలపై ఈ చిత్రాన్ని రూపొందించారు. భారతదేశంలో ఎంతో మంది చేయని తప్పులకు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అదే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. ప్రైవేట్ జైల్ అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాలో చూపించారు.

    మోహన్ బాబు అన్యాయంగా జైల్లో ఇరుక్కుపోయి అందులోంచి బయటకు వచ్చి ఇందులో దేశానికి వ్యతిరేకంగా సాగే మోసగాళ్లను ఏరివేస్తుంటాడు. యంగ్ మోహన్ బాబు పాత్రలో మంచు విష్ణు నటించారు. చాలా ఏళ్ల తర్వాత మోహన్ బాబు సోలో హీరోగా రూపొందుతున్న ‘సన్నాఫ్ ఇండియా’ చిత్రంలో మోహన్ బాబు మరోసారి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ కింగ్ అనిపించుకున్నారు. సినిమాలేవీ లేకపోవడం.. కరోనాతో పెద్ద సినిమాలు దూరమైన నేపథ్యంలో వచ్చిన ఈ సన్నాఫ్ ఇండియా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. ఈ సీరియస్ డ్రామాకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలపై పోరాటం చేసే పాత్రలో మోహన్ బాబు వీరావేశం చూపించారు. ఆ సీరియస్ డ్రామాకు తొలిరోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి.

    -సన్నాఫ్ ఇండియా తొలి రోజు కలెక్షన్స్
    -నైజాం- రూ.40 లక్షలు
    -సీడెడ్ -30 లక్షలు
    -ఆంధ్రా 25 లక్షలు
    -యూఎస్ ఓవర్సీస్ -50k డాలర్లు

    దాదాపుగా తొలిరోజు కోటి రూపాయల లోపే కలెక్షన్లు అయ్యాయి. ముందస్తు బుకింగ్స్ తో ఈ లెక్క తేలింది.