https://oktelugu.com/

Mahesh Babu Pawan Kalyan: ఏంటా నటన.? భీమ్లానాయక్ చూసి మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్

mahesh babu great review on pawan kalyans bheemla nayak movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ పర్ ఫామెన్స్ కు సామాన్య ప్రేక్షకులే కాదు.. సూపర్ స్టార్లు కూడా ఫిదా అవుతున్నారు. పవన్ విశ్వరూపం చూపించిన ‘భీమ్లానాయక్’ మేనియా ప్రస్తుతం తెలుగు నాట కొనసాగుతోంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్లకు జనం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వీకెండ్ పూట సూపర్ స్టార్ మహేష్ బాబు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 26, 2022 / 09:09 PM IST
    Follow us on

    mahesh babu great review on pawan kalyans bheemla nayak movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ పర్ ఫామెన్స్ కు సామాన్య ప్రేక్షకులే కాదు.. సూపర్ స్టార్లు కూడా ఫిదా అవుతున్నారు. పవన్ విశ్వరూపం చూపించిన ‘భీమ్లానాయక్’ మేనియా ప్రస్తుతం తెలుగు నాట కొనసాగుతోంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్లకు జనం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వీకెండ్ పూట సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ‘భీమ్లానాయక్’ మూవీ చూశాడు. ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. అవిప్పుడు వైరల్ అయ్యాయి.

    ఇప్పటికే భీమ్లానాయక్ మూవీ సక్సెస్ కావడంతో సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ సినిమాను చూశారు. అది చూసి మైండ్ బ్లాంక్ అయిపోయినట్టు స్పందించారు. మహేష్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

    భీమ్లానాయక్ చూసి సోషల్ మీడియా వేదికగా చిత్రంయూనిట్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. వాటే పెర్ఫార్మెన్స్ అంటూ పవన్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక డేనియల్ శేఖర్ గా రానా స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్ అంటూ ట్వీట్ చేశాడు మహేష్. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

    ‘భీమ్లానాయక్ పాత్రలో నిప్పులు చెరిగే తీవ్రతతో ఎగిసే జ్వాలలా పవన్ కళ్యాణ్ కనిపిస్తే.. డేనియల్ శేఖర్ గా రానా సెన్షేషనల్ పర్ఫామెన్స్ ఇచ్చారు. తెరపై అద్భుతంగా నటించారు. ఎప్పట్లాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కలం నుంచి పదునైన డైలాగులు వచ్చాయి. ఇటీవల కాలంలో త్రివిక్రమ్ కు ఇదే అత్యుత్తమం అని చెప్పాలి. నాకు నచ్చిన సినిమాటోగ్రాఫర్లలో ఒకడైన రవి కే చంద్రన్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. తమన్ సంగీతం మనల్ని వెన్నాడుతోంది. మంత్ర ముగ్ధులను చేస్తుంది.యావత్ చిత్ర బృందానికి అభినందనలు ’’ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

    ఫిబ్రవరి 25న ఈ శుక్రవారం ‘భీమ్లానాయక్’ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పవన్, రానా మెయిన్ రోల్ పోషించారు. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించగా.. తమన్ సంగీతం అందించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాశారు.

    https://twitter.com/urstrulyMahesh/status/1497579296616898562?s=20&t=Vfx9z13PBvyxB7ONQgy2fg