Naresh – Pavitra Lokesh : నరేష్-పవిత్ర లోకేష్ లది టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హైడ్రామా. నెలలుగా వీరి వ్యవహారం మీడియాలో హైలెట్ అవుతుంది. ఈ జంట కనిపిస్తే చాలు న్యూస్. సిల్వర్ స్క్రీన్ పై నరేష్-పవిత్ర నటిస్తే జనాలు ఈలలు వేస్తున్నారు. అంతగా ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలో వీరు హీరో హీరోయిన్స్ గా ఒక ప్రేమకథా చిత్రం తెరకెక్కనుందనే వార్త టాలీవుడ్ ని కుదిపేస్తోంది. ఇదేం ట్విస్ట్ బాబోయ్ అని జనాలు ఆశ్చర్యచకితులు అవుతున్నారు. వారిద్దరి నిజ జీవితాలు ఆధారంగా ఈ మూవీ రూపొందనుందట. నరేష్ తో పవిత్ర పరిచయం, అది ప్రేమగా మారిన వైనం… సహజీవనానికి దారితీసిన పరిస్థితులు వంటి విషయాలు టచ్ చేయనున్నారట.

నరేష్-పవిత్రల ఎమోషనల్ జర్నీని హృద్యంగా చూపించనున్నారనేది విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రానికి నరేష్ నిర్మాత అంటున్నారు. వారు హీరో హీరోయిన్ గా చేస్తే జనాలు ఆదరిస్తారా? నరేష్ కి అంత ధైర్యం ఏమిటనే చర్చ మొదలైంది. హీరో హీరోయిన్ వారే కాబట్టి రెమ్యూనరేషన్ మిగతా యాక్టర్స్ కి, సాంకేతిక వర్గానికి ఇవ్వాల్సి ఉంటుంది. పరిమిత బడ్జెట్లో రెండు మూడు కోట్లతో ప్లాన్ చేస్తున్నారట.
నరేష్ వద్ద ఉన్న ఆస్తితో పోల్చితే ఇదేమీ పెద్ద అమౌంట్ కాదంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. మూడో భార్య రమ్య రఘుపతితో విడిపోయిన నరేష్ నటి పవిత్ర లోకేష్ కి దగ్గరయ్యారు. రెండేళ్లకు పైగా సహజీవనం చేస్తున్నారు. ఆ మధ్య జంటగా మహాబలేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. దీంతో పెళ్లి చేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి.
పెళ్లి వార్తలకు నరేష్ మీడియా ముఖంగా స్పష్టత ఇచ్చారు. పెళ్లిపై నాకు నమ్మకం లేదు. పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాను అన్నారు. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనని నరేష్ కుండబద్దలు కొట్టారు. పవిత్ర లోకేష్-నరేష్ బంధాన్ని మూడో భార్య రమ్య రఘుపతి తప్పుబట్టారు. నాకు అధికారికంగా విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో సంబంధం ఎలా పెట్టుకుంటాడని ఆరోపిస్తున్నారు. ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు.