Kriti Sanon- Allu Arjun: ఈమధ్య సౌత్ హీరోలపై కొందరు బాలీవుడ్ భామలు హాట్ కామెంట్లు చేస్తున్నారు. వారి సినిమాలన్నా.. వారి నటన అన్నా పిచ్చెక్కి స్తోందని ఓపెన్ గానే చెబుతున్నారు. గతంలో త్రిబుల్ ఆర్ ప్రమోషన్ సమయంలో ఎన్టీఆర్ తో ఒక్క సినిమా చేస్తే చాలు… అని స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలిపింది. అలాగే మహేశ్ బాబు పక్కన నటించాలని కోరిక ఉందని దీపికా పదుకొనే పలు సందర్భాల్లో పేర్కొంది. లేటెస్ట్ గా అల్లు అర్జున్ గురించి ఓ స్టార్ నటి హాట్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆయన కోసం ఏ పనికైనా సిద్ధంగా ఉన్నానంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ తో పాటు బీ టౌన్ ను షేక్ చేస్తున్నాయి.

‘పుష్ప’ మూవీతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ సినిమా ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు హీరో అల్లు అర్జున్ కు విపరీతంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఇందులో కామన్ ఆడియన్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్ స్టార్స్ .. అందులోనే హీరోయిన్లు ఉండటం విశేషం. ‘పుష్ప’లో బన్నీ నటనకు చాలా మంది ఫిదా అయ్యారు. దీంతో పుష్ప 2లో తమకు అవకాశం ఇస్తే బాగుండు.. అని కొందరు హీరోయిన్లు పరోక్షంగా కామెంట్స్ కూడా చేశారు. ఇలాంటి సమయంలో ప్రముఖ నటి కృతి సనన్ అల్లు అర్జున్ పై అరాచక స్టేట్మెంట్ ఇచ్చింది.
వరుణ్ ధావన్, కృతి సనన్ కలిసి నటించిన ‘భేదియా’ను తెలుగులో ‘తోడేలు’ పేరుతో అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో, హీరోయిన్లు హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోల్లో తనకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఆయనతో నటించే అవకాశం వస్తే ఏమాత్రం వదులుకోను అని పేర్కొంది. బన్నీ డ్యాన్స్ అన్నా.. స్టైల్ అన్నా పిచ్చెక్కిపోతుంది అని కృతి చేసిన కామెంట్స్ నెట్టింట్లో హల్ చల్ చేశాయి.

కృతి సనన్ ఇప్పటికే సౌత్ హీరో ప్రభాస్ తో కలిసి ‘ఆదిపురుష్’లో నటిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు సౌత్ హీరోలంటే తెగ ఇష్టమని తెలిసింది. అయితే ఈ భామ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో ఇచ్చింది. మహేశ్ బాబుతో ‘నేనొక్కడినే’ అనే సినిమాలో నటించింది. ఆ తరువాత నాగచైతన్యతో కలిసి ‘దోచెయ్’ అనే సినిమాలో మెరిసింది. ఈ రెండూ ప్లాప్ కావడంతో టాలీవుడ్ ను వదిలేసుకుంది. చాలా రోజుల తరువాత ‘తోడేలు’తో తెలుగు తెరపై కనిపించనుంది.