Kalyan Ram Amigos : 14 రాత్రుళ్లు చేస్తే కానీ బయటపడని కళ్యాణ్ రామ్ లో రొమాంటిక్ యాంగిల్

Kalyan Ram Amigos : “ఎన్నో రాత్రులు వస్తాయి గాని… రాదే వెన్నెలమ్మ” ధర్మక్షేత్రం సినిమాలో ఈ పాట అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. వేటూరి, సీతారామ శాస్త్రి ద్వయం రాసిన ఈ పాటకు ఇళయ రాజా బాణీలు సమకూర్చారు. ఈ సినిమా విడుదలయి ఏళ్లు గడిచినా నేటికీ ఏ ఎఫ్ఎం లోనో, యూ ట్యూబ్ లోనే వినిపిస్తే ఆటో మేటిగ్ గా పెదాలు హమ్ చేస్తాయి. అంతటి ఇంపాక్ట్ ఈ పాట సొంతం. అలాంటి ఈ పాటను […]

Written By: Bhaskar, Updated On : February 8, 2023 7:51 pm
Follow us on

Kalyan Ram Amigos : “ఎన్నో రాత్రులు వస్తాయి గాని… రాదే వెన్నెలమ్మ” ధర్మక్షేత్రం సినిమాలో ఈ పాట అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. వేటూరి, సీతారామ శాస్త్రి ద్వయం రాసిన ఈ పాటకు ఇళయ రాజా బాణీలు సమకూర్చారు. ఈ సినిమా విడుదలయి ఏళ్లు గడిచినా నేటికీ ఏ ఎఫ్ఎం లోనో, యూ ట్యూబ్ లోనే వినిపిస్తే ఆటో మేటిగ్ గా పెదాలు హమ్ చేస్తాయి. అంతటి ఇంపాక్ట్ ఈ పాట సొంతం. అలాంటి ఈ పాటను కళ్యాణ్ రామ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న అమిగోస్ సినిమాలో రీమేక్ చేశారు. ధర్మక్షేత్రం సినిమాలో ఈ పాటను ఇళయరాజా స్వర పరిచారు. అమిగోస్ సినిమాలో జీబ్రాన్ స్వరపరిచారు. ఒరిజినల్ పాటకు ఏ మాత్రం తీసుకోకుండా బాణీలు సమకూర్చారు.

ధర్మక్షేత్రంలో ఈ పాటను ఎస్పీ బాలసుబ్రమణ్యం, మనో, జానకి, చిత్ర పాడారు. ఈ పాటకు సంబంధించి అప్పట్లో బాలకృష్ణ, దివ్యభారతి వేసిన స్టెప్పులు ఉర్రూతలూగించాయి.. తాజాగా అమిగోస్ సినిమాలో ఈ పాటను రీమేక్ చేశారు.. ఈ పాటకు డ్యాన్స్ మాస్టర్ శోభి కొరియోగ్రఫీ అందించారు.. హీరోయిన్ ఆశిక రంగనాథ్, కళ్యాణ్ రామ్ పోటీపడి డ్యాన్సులు చేశారు.. ముఖ్యంగా ఈ పాట కోసం వేసిన సెట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.. పాటలో పల్లవి, చరణాలకు అనుగుణంగా ఈ సెట్టింగ్ రూపొందించారు.. ఇక ఈ సినిమాలో పాటని బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్, సమీరా భరద్వాజ్ ప్రాణం పెట్టి పాడారు.. ఈ పాటకు సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ అందించారు.

ఈ పాటకు సంబంధించి షూటింగ్ ప్రక్రియకు 14 రాత్రులు పట్టింది.. శోభి మాస్టర్, ఆయన బృందం తీవ్రంగా కష్టపడ్డారు. అనుకున్న ఔట్పుట్ వచ్చేందుకు టేకుల మీద టేకులు తీసుకున్నారు.. ఈ పాటకు సంబంధించి మేకింగ్ వీడియోను చిత్ర బృందం యూట్యూబ్లో రిలీజ్ చేసింది.. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అన్నట్టు ఈ సినిమాలో ఈ పాట ద్వారా కళ్యాణ్ రామ్ లో రొమాంటిక్ యాంగిల్ కూడా చూపాడు దర్శకుడు రాజేందర్ రెడ్డి.