Jr NTR – Sr NTR Centenary celebrations : తాత వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ దూరం

లోకేష్ కు సీఎం పోస్టు అప్పగిస్తారన్న ప్రచారం ఉంది. ఇన్ని సమీకరణల మధ్య తన సినీ కెరీర్ ను పాడుచేసుకొని రాజకీయాలు చేయడం వేస్టన్న రీతిలో జూనియర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. స్టార్ క్యాంపెయినర్ గా ఉండడం ఇష్టం లేకే తారక్ ముఖం చాటేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Written By: Dharma, Updated On : May 20, 2023 5:12 pm
Follow us on

Jr NTR – Sr NTR Centenary celebrations : ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ డుమ్మా కొట్టారు. ఈ విషయాన్ని ఈవెంట్ టీమే స్పష్టం చేసింది. తారక్ కు ముందస్తు కార్యక్రమాలుండడంతోనే ఆయన రావడం లేదని చెప్పుకొచ్చింది. ఉత్సవ కమిటీ చైర్మన్ హోదాలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్, ఎన్టీఆర్ చిన్న కుమారుడు రామక్రిష్ణ తారక్ ఇన్విటేషన్ కార్డు అందించారు. తప్పకుండా హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని జూనియర్ ఎన్టీఆర్ వారికి హామీ ఇచ్చారు. దీంతో ఆయన తప్పకుండా హాజరవుతారని అంతా భావించారు. కానీ ఆయన గైర్హాజరుకే మొగ్గుచూపారు.

మే 20 తారక్ పుట్టిన రోజు. ఏటా ఈ సమయానికి షూటింగులకు విరామం ఇచ్చి క్లోజ్ సర్కిల్ లోని కుటుంబాలతో గడపడం తారక్ కు రివాజుగా మారింది. ఈ ఏడాది కుటుంబంతో మాల్దీవులు వెళ్లాలని తారక్ డిసైడయ్యారు. ముందస్తుగా ప్లాన్ చేసుకున్నారు. సరిగ్గా ఇదే సమయానికి తాత శత జయంతి వేడుకల ఇన్విటేషన్ ను అందుకున్నారు. దీంతో అంతా వస్తారని భావించారు. కానీ రావడం లేదని తారక్ సమాచారమివ్వడంతో నందమూరి ఫ్యాన్స్ హర్టయ్యారు. కేవలం ముందస్తు కార్యక్రమాలే కారణమా.. ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నది ఇప్పుడు చర్చకు వస్తోంది.

పేరుకే ఇది శతజయంతి వేడుకల ఈవెంట్ కానీ.. దీని వెనుక చంద్రబాబు స్కెచ్ ఉందని ఎప్పటి నుంచో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ కానీ  జూనియర్ ఎన్టీఆర్ హాజరైతే చంద్రబాబుతో కలసి వేదిక మీద కనిపించాలి. దీంతో కచ్చితంగా సమీకరణలు మారుతాయి. తరువాత జరిగే మహానాడుకు ఆహ్వానిస్తారు. అక్కడకు వస్తే ఎన్నికల ప్రచారానికి కమిట్ చేస్తారు. ఇవన్నీ లెక్క వేసుకునే తారక్ గైర్హాజరుకు మొగ్గుచూపి ఉంటారని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

అయితే చాలా కాలంగా టీడీపీ కి జూనియర్ కి మధ్య గ్యాప్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే పరిణామాలు ఉన్నాయి. తారక్ కూడా టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా లోకేష్ ను ప్రొజెక్టు చేసేందుకే అటు చంద్రబాబు, ఇటు బాలక్రిష్ణ ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఉంది. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిచినా చంద్రబాబు సీఎం పోస్టులో ఉండేది కొద్దిరోజులేనని టాక్ నడుస్తోంది. లోకేష్ కు సీఎం పోస్టు అప్పగిస్తారన్న ప్రచారం ఉంది. ఇన్ని సమీకరణల మధ్య తన సినీ కెరీర్ ను పాడుచేసుకొని రాజకీయాలు చేయడం వేస్టన్న రీతిలో జూనియర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. స్టార్ క్యాంపెయినర్ గా ఉండడం ఇష్టం లేకే తారక్ ముఖం చాటేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఆయన చర్యలతో అభిమానులు మాత్రం హర్టవుతున్నారు.