India Today – Ram Charan : #RRR మూవీ కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ లో ఆస్కార్ అవార్డు రావడం తో మూవీ టీం మొత్తం ఎంతగానో ఎంజాయ్ చేస్తుంది.కలలో కూడా సాధ్యపడదు అని అనుకుంటున్న ఈ అరుదైన ఘనత ని రాజమౌళి – రామ్ చరణ్ – ఎన్టీఆర్ సాధించి తీసుకొచ్చారు.ముఖ్యంగా హీరోలిద్దరికి ఎంత అనందం గా ఉంది ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఎందుకంటే తమ కెరీర్ లోని మూడు సంవత్సరాల విలువ సమయాన్ని ఈ చిత్రం కోసం వెచ్చించారు.
మధ్యలో హీరోలకు ఎన్నో గాయాలై షూటింగ్స్ ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి, ఆ తర్వాత కరోనా మహమ్మారి అడ్డుపడి షూటింగ్ నిలిచిపోయింది.అలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ సినిమాని నిర్మించారు.దానికి వచ్చిన ఫలితాన్ని ఇప్పుడు ఆస్వాదిస్తున్నారు.ఇక రామ్ చరణ్ ఈరోజే అమెరికా నుండి ఇండియా కి వచ్చాడు.వచ్చి రాగానే ఆయన ఇంటికి వెళ్లిపోలేదు,ఢిల్లీ లో జరిగిన ‘ఇండియా టుడే కాంక్లేవ్’ మీటింగ్ లో పాల్గొన్నాడు.
ఈ మీటింగ్ కి ముందుగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసాడు.ఈ వార్త సోషల్ మీడియా లో ప్రకంపనలు సృష్టించింది.ఇది ఇలా ఉండగా ఇండియా టుడే కాంక్లేవ్ ఈవెంట్ లో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తో తనకి ఉన్న రిలేషన్ గురించి చెప్తూ ‘మొదటి నుండి మేమిద్దరం మంచి స్నేహితులం.కానీ #RRR మూవీ చేస్తున్న సమయం లో మా స్నేహం కాస్త బ్రదర్స్ రిలేషన్ అయ్యింది.నా భార్య ఉపాసన తో నేను ఎలాంటి కష్టసుఖాలు మొహమాటం లేకుండా పంచుకునే ఒక దగ్గర మనిషి అయ్యాడు.ఈ చిత్రాన్ని రాజమౌళి కాకపోతే మేము అసలు చేసేవాళ్ళం కాదు, ఎందుకంటే మా రెండు కుటుంబాలు 35 సంవత్సరాల నుండి బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా నేనా అనే విధంగా ఉంటుంది.కాస్త మా క్యారెక్టర్స్ లో లోపాలు ఉన్న బయట గొడవలు జరిగిపోతాయి.మమల్ని మ్యానేజ్ చెయ్యాలంటే ఒక్క రాజమౌళికి మాత్రమే సాధ్యం, అందుకే ఆయన దర్శకత్వం లో నటించడానికి ఇద్దరం వెనుకాడలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.